ByGanesh
Tue 18th Jun 2024 10:32 AM
రష్మిక మందన్న గ్లామర్ కి గ్లామర్ ఫిట్ నెస్ కి ఫిట్ నెస్ మైంటైన్ చేస్తుంది. జిమ్ లో ఎక్కువ సేపు గడుపుతూ వర్కౌట్స్ చేసే రష్మిక మందన్న ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్స్ తో సినిమాలు చేస్తూ క్రేజీగా మారిపోయింది. గ్లామర్ కి అధిక ప్రాధాన్యతనిస్తూ ఫిట్ నెస్ ని కాపాడుకునే రష్మిక హిందీ, తెలుగు, తమిళ చిత్రాలతో బిజీగా ఉంటుంది.
అయినప్పటికి ఫిట్ నెస్ విషయంలో పర్ఫెక్ట్ గా ఉండే రష్మిక మందన్న తాజాగా జిమ్ కి వెళ్లొస్తున్న పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ పిక్స్ లో రష్మిక అలిసిపోయి చెమటలు చిందించినా యాక్టీవ్ గా సరదాగా కనిపించింది. అంతేకాదు స్మైల్ చేస్తూ ఫొటోలకి ఫోజులిచ్చింది. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇక రష్మిక నటించిన పుష్ప 2 డిసెంబర్ 6 న విడుదలకాబోతుండగా.. ధనుష్ తో చేస్తున్న కుబేర మూవీ దివాళికి విడుదలయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. అలాగే రష్మిక నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీస్ గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో చిత్రాలతో పాటుగా.. హిందీ హీరో సల్మాన్ ఖాన్ సికిందర్ లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది, పలు ప్రాజెక్ట్స్ తో రష్మిక ఫుల్ బిజీగా మారిపోవడం కాదు.. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది.
Rashmika Mandanna is drenched with workouts:
Rashmika Mandanna latest workout pics goes viral