GossipsLatest News

Amala Paul, Jagat Desai Become Proud Parents అమ్మయిన అమల పాల్



Tue 18th Jun 2024 11:32 AM

amala paul  అమ్మయిన అమల పాల్


Amala Paul, Jagat Desai Become Proud Parents అమ్మయిన అమల పాల్

కోలీవుడ్ నటి అమల పాల్ అమ్మయ్యింది. గత ఏడాది బాయ్ ఫ్రెండ్ జగత్ దేశాయ్ ని వివాహమాడిన అమల పాల్ ఈ ఏడాది పండంటిబిడ్డని ఎత్తుకుని మురిసిపోయింది. జగత్ దేశాయ్ ని నిశ్చితార్ధం చేసుకుని.. తమ ప్రేమ వ్యవహారాన్ని పబ్లిక్ గా ప్రకటించిన అమల పాల్ చాలా ఫాస్ట్ గా పెళ్ళికి రెడీ అయ్యింది. ఇరు కుటుంబాల నడుమ 2023 లో అంగరంగ వైభవంగా జగత్ దేశాయ్-అమల పాల్ జంట ఏడడుగులు నడిచి ఒక్కటయ్యింది. 

అమలా పాల్.. కొన్నినెలల క్రితం తమ జీవితంలో మరో కొత్త వ్యక్తి రాబోతున్నారంటూ తన ప్రెగ్నెన్సీ శుభవార్తని అభిమానులతో పంచుకుంది. ఆ తర్వాత బేబీ బంప్ ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తోందీ జంట. కొద్దిరోజుల క్రితం అమల పాల్ శ్రీమంతం వేడుకని జగత్ దేశాయ్ గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసారు. 

జూన్ 11 న అమల పాల్ అమ్మగా ప్రమోషన్ పొందింది. ఇట్స్ బేబీ బాయ్. మా చిన్ని అద్భుతాన్ని చూసేయండి. 11.06.2024న జన్మించాడు.. అంటూ సోషల్ మీడియాలో షేర్ చేసింది అమల. తన కొడుకుని చేతుల్లో ఎత్తుకొని ఇంట్లోకి సంతోషంగా అడుగుపెట్టగా.. కుటుంబ సభ్యులు ఇంటిని అందంగా డెకరేట్ చేసి ఆమెకి ఆహ్వానం పలికిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 


Amala Paul, Jagat Desai Become Proud Parents :

Amala Paul, Jagat Desai Become Proud Parents Of A Baby Boy









Source link

Related posts

హమ్మయ్య విక్రమ్ మూవీ వచ్చేస్తోంది!

Oknews

Have you heard Rashmika philosophy? రష్మిక ఫిలాసఫీ విన్నారా?

Oknews

‘భారతీయుడు 2’ టీమ్‌ని అభినందించిన సీఎం రేవంత్‌రెడ్డి!

Oknews

Leave a Comment