వైసీపీ నేతలపై ఫిర్యాదులు
నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలపై వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెల్లూరు జిల్లా చిన్నబజారు పోలీసు స్టేషన్‌లో వాలంటీర్లు స్థానిక కార్పొరేటర్, వైసీపీ నేతలపై ఫిర్యాదు చేశారు. ఎన్నికలకు ముందు తమతో బలవంతంగా రాజీనామా చేయించారని వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీటింగ్ అని పిలిచి రాజీనామా చేయించారని ఆరోపించారు. రాజీనామాలు చేయనివారిపై ఒత్తిడి చేశారన్నారు. నియోజకవర్గాల్లో వాలంటీర్లు స్థానిక ఎమ్మెల్యేలను కలిసి తమ ఉద్యోగాలు తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు. ఎన్నికల సమయంలో లక్షకు పైగా వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. వైసీపీ ప్రభుత్వంలో 1.25 లక్షల మంది వాలంటీర్లను నియమించారు. వీరిలో దాదాపుగా 1.08 లక్షల మంది రాజీనామాలు చేశారు. ఇప్పుడు వీరంతా స్థానిక కూటమి నేతలకు వినతులు అందిస్తున్నారు.