విలక్షణ నటుడు కమల్ హాసన్ లిప్‌లాక్స్‌కు ఫేమస్ అనే విషయం తెలిసిందే. ఆయన నటించిన సినిమాల్లో ముద్దు సీన్లు సర్వసాధారణం. తాజాగా కమల్, రేఖ కలిసి నటించిన ఓ ముద్దు సీన్‌పై రగడ కొనసాగుతున్నది. 1986లో ప్రముఖ దర్శకుడు బాలచందర్ దర్శకత్వం వహించిన పున్నాగై మన్నన్ (తెలుగులో డ్యాన్స్ మాస్టర్) సినిమాలోని ఓ సీన్ ఇప్పుడు వైరల్‌గా మారింది. గతంలో ముద్దు విషయంపై ఆ సీన్‌లో నటించిన హీరోయిన్ రేఖ వెల్లడించిన ఇంటర్వ్యూ మీడియాలో సెన్సేషనల్‌గా మారింది.