Health Care

ఈ గ్రామంలో ఏ ఇంటికి తలుపులు ఉండవు.. కారణం ఏంటంటే?


దిశ, ఫీచర్స్: ప్రస్తుత రోజుల్లో దొంగతనాలు ఎంతగా పెరిగిపోయాయో మన అందరికీ తెలిసినదే. తాళాలు వేసుకుని పోయిన తాళాలు పగలగొట్టి మరీ దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఒకవేళ అడ్డుకోవడానికి ట్రై చేస్తే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడట్లేదు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చి మరీ దొంగతనాలు చేస్తున్నారు. చెడ్డీ గ్యాంగ్, ధార్ గ్యాంగ్, గొలుసుల దొంగలు, దొంగల ముఠాలు అంటూ రెచ్చిపోతున్నారు. మరి ఇలాంటి రోజుల్లో కూడా మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో ఉన్న శని శింగనాపూర్ గ్రామంలో ఏ ఒక్క ఇంటికి కూడా తలుపులు ఉండవట. అసలు ఆ ఊరి ప్రత్యేకత ఏంటో ఇక్కడ చూద్దాం..

సౌరాష్ట్రలో ఉన్న ఈ గ్రామం.. రాజ్‌కోట్‌లోని సత్తా గ్రామం నుండి 23 కి.మీ దూరంలో ఉంది. భైరవ దాదా దేవాలయం ఇక్కడ ఎంతో ముఖ్యమైనది. అయితే ఈ ఊరి ఇళ్లకు ఒక్క తలుపు కూడా ఉండదు. అందువల్ల ఇంటికి తాళం వేయాల్సిన అవసరం లేదు. గ్రామంలో నివసించే భైరవ్ దాదా తమను రక్షిస్తాడని స్థానికుల నమ్మకమట.

అయితే స్థానికులు ఈ గ్రామం గురించి చెబుతూ.. తమ గ్రామంలో భైరవ్ దాదా నివాసం ఉంటున్నారని చెప్పారు. అందుకే ఊరిలో ఎవరూ దొంగతనం చేయలేరని వివరించారు. అంతేకాదు ఎవరైనా దొంగతనం చేయాలని చూసినా వాళ్లు గుడ్డివాళ్లు అయిపోతారని అంటున్నారు. అందుకే తమ గ్రామాన్ని మినీ శని శింగనాపూర్ అని పిలుస్తారని తెలిపారు. ఇక గ్రామంలో నాలుగేళ్ల క్రితం నలుగురు దొంగలు దొంగతనానికి రాగా వారు నెత్తురు కక్కుకుని చనిపోయారని.. వారి సమాధులు ఇక్కడే ఉన్నాయని స్థానికులు అంటున్నారు. తమ చుట్టుపక్కల గ్రామాల్లో దొంగతనాలు జరుగుతాయి కానీ.. తమ గ్రామంలో ఎప్పుడూ అలాంటివి జరగలేదని చెబుతున్నారు. తమ తాతల కాలం నుంచి ఈ గ్రామంలో ఏ ఇంటికి తలుపులు లేవని చెబుతున్నారు. నేటికీ దానిని తాము పాటిస్తున్నామని భైరవ దాదా తమను అనుక్షణం కాపాడుతాడని అంటున్నారు గ్రామస్తులు.

ఇక గ్రామంలో కొలువైన భైరవ దాదా ఆలయాన్ని దర్శించుకోడానికి నిత్యం వేలాది మంది తమ గ్రామానికి వస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. నిర్మలమైన మనసుతో స్వామిని కోరుకున్న కోరికలు నెరవేరుతాయని అంటున్నారు. ఇక ప్రస్తుతం భైరవ దాదాను దర్శించుకునేందుకు విదేశాల నుంచి కూడా భక్తులు వస్తున్నట్లు స్థానికులు తెలిపారు.

 



Source link

Related posts

వర్షం పడినప్పుడు ఆకాశంలో మెరుపులు ఎందుకు వస్తాయో తెలుసా?

Oknews

గేట్ ఆన్సర్ కీ విడుదల.. రేపటి నుంచి తెరచుకోనున్న అభ్యంతరాల విండో

Oknews

రాత్రి వేళ బీపీ పెరుగుతుందా.. అయితే, వీటి గురించి తెలుసుకోవాల్సిందే!

Oknews

Leave a Comment