తెలుగు సినీ ఇండస్ట్రీ దాదాపుగా మర్చిపోయిన యంగ్ హీరోయిన్ అవికా గోర్ ని మరలా మెరిపించాడు దర్శకుడు ఓంకార్. రాజుగారి గది 3లో అవికా హీరోయిన్ గా చేసింది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ప్లాప్ ప్లాప్ టాక్ తెచ్చుకుంది కానీ అవికా గౌర్ కి మంచి పేరు వచ్చింది అనే చెప్పాలి. మళ్లీ సినిమాల్లోకి వచ్చిన అవికా గౌర్ ఇప్పుడు గ్లామర్ షోకు కూడా రెడీ అంటోంది. ఏదైనా సినిమాలో చేయాల్సి వస్తే తప్పకుండా ఎక్స్ పోజింగ్ చేస్తానంటోంది.
కాస్త బొద్దుగా ఉండే అవికా ఇప్పుడు స్లిమ్ గా మారింది జీరో సైజు లో కుర్రకారుని పిచ్చి ఎక్కిస్తుంది. దాని వెనక ఓ బలమైన కారణం కూడా చెప్పింది అవికా. ఎంతోమంది తిట్టడం వల్ల తను బరువు తగ్గాను అని చెప్పింది. ఆ విషయంలో ట్రోలింగ్స్ తనకు బాగా సహాయపడ్డాయి. బరువు పెరగడం తనకు ఆరోగ్య సమస్య కాదని, కేవలం బద్దకం వల్లనే బరువు పెరిగానంటోంది. బరువు తగ్గిన అవికా గ్లామర్ హీరోయిన్ అనిపించుకోవాలని ఆశపడుతోంది.
Topics: