లీగ్ దశలో విజయాలతో సూపర్ 8కి వచ్చేసిన టీమిండియా ఈ రోజు మొదటి టాస్క్ ను ఎదుర్కోనుంది. అది కూడా పసికూన లా కనిపించే కసికూన ఆఫ్గనిస్తాన్ తో. బార్బడోస్ లోని కెన్సింగ్టన్ ఓవల్ లో ఈ రోజు రాత్రికి జరిగే మ్యాచ్ లో రషీద్ ఖాన్ సేనతో హిట్ మ్యాన్ ఆర్మీ తలపడనుంది. ఇరు జట్లలో భారతే ఫేవరెట్ గా కనిపిస్తున్న ఆఫ్గాన్ ను తక్కువ అంచనా వేస్తే లీగ్ దశలో న్యూజిలాండ్ కు పట్టిన గతే పడుతుంది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఈ రోజు సూపర్ 8 దశ కూడా చూడకుండా ఇంటి దారి పట్టిందంటే రీజన్ ఆఫ్గాన్ తో లీగ్ మ్యాచ్ లో దారుణంగా ఓడిపోవటమే. సో టీమిండియా జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. ఇక ఇరు జట్ల బలాబలాలు చూస్తే టీమిండియా ఓపెనర్లు, సీనియర్లైన విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ కలిసి కట్టుగా బ్యాట్ ఝుళిపించాల్సిన అవసరం ఉంది. అసలు ఈ సీజన్ లో ఇప్పటివరకూ కింగ్ ఆడి పది పరుగులు దాటిన మ్యాచ్ ఒక్కటి కూడా లేదు. హిట్ మ్యాన్ కూడా కీలక మ్యాచ్ ల ముందు జోరు చూపించాలి.
క్రికెట్ వీడియోలు
Gautam Gambhir Team India Head Coach | టీమిండియా హెడ్ కోచ్ గా రావటమే కాదు అంతకు మించి గంభీర్ ప్లాన్
మరిన్ని చూడండి