Health Care

రోజూ ఈ టీ తాగితే ఆ సమస్యలకు చెక్.. క్యాన్సర్లు, గుండె జబ్బులు కూడా..


దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం టీ తాగనిదే పొద్దు గడవని వారు చాలామందే ఉన్నారు. అయితే టీ, కాఫీలు ఎక్కువగా తాగడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదని చెప్తుంటారు. అందుకు ప్రత్యామ్నాయంగా గ్రీన్ టీ, లెమన్ టీ, హనీ టీ వంటివి తాగాలని చెప్తుంటారు. ప్రస్తుతం ఎన్నో రకాల టీలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఆరోగ్యానికి మేలు చేసేవాటిలో మాత్రం కొన్నే ఉంటాయి. అలాంటి వాటిలో లెమన్ గ్రాస్(నిమ్మ గడ్డి)టీ కూడా ఒకటి. దీనిని రోజూ తాగడంవల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేదిక్ నిపుణులు చెప్తుంటారు. అవేంటో చూద్దాం.

లెమన్ గ్రాస్ టీ తాగడంవల్ల అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చునట. ముఖ్యంగా బీపీ, అధిక బరువు సమస్యలు తగ్గుతాయని, బాడీలో చెడు కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుందని, శరీరంలోని విష పదార్థాలు మూత్రం ద్వారా బయటకు వెళ్తాయని, జీవ క్రియలు నియంత్రించడబడతాయి. అంతేకాకుండా లెమన్ గ్రాస్‌లో టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాల కారణంగా అది గుండె జబ్బులు రాకుండా నివారిస్తుందట. అందుకే రోజులో ఎక్కువసార్లు రెగ్యులర్ టీ, కాఫీలు తాగే అలవాటు ఉన్నవారు, వాటిని తగ్గించాలంటే ప్రత్యామ్నాయంగా దీనిని ప్రారంభించాలని నిపుణులు సూచిస్తున్నారు.

లెమన్ గ్రాస్ టీ తయారీ విషయానికి వస్తే ముందుగా నిమ్మ గడ్డిని శుభ్రంగా కడగాలి. ఓ గిన్నెలో నీళ్లుపోసి, దానిని అందులో వేసి స్టవ్ మీద 10 నిమిషాలు మరిగించాలి. ఈ సందర్భంగా ఆవిరి బయటకు పోకుండా మూత పెట్టాలి. ఆ తర్వాత గిన్నెలోని పానీయాన్ని తీసుకొని తేనె లేదా బెల్లం వేసుకొని తాగవచ్చు. ఇలా రోజూ తాగేవారిలో గుండె జబ్బులు, క్యాన్సర్లు వంటివి రాకుండా ఉంటాయని, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తుంటారు.

* నోట్: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. దీనివల్ల కలిగే పరిణామాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.



Source link

Related posts

రైల్లో ఒంటరిగా వెళ్తున్న యువతి.. తన పరిస్థితి అక్కకు చెప్పడంతో.. రంగంలోకి అధికారులు

Oknews

ముఖానికి సబ్బు ఎక్కువగా పెడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి!

Oknews

కలలో వర్షం కనిపించిందా.. ఎలాంటి వర్షం ఏ ఫలితాలను సూచిస్తుందంటే?

Oknews

Leave a Comment