Entertainment

mahesh babu new movie Maharshi teaser


మహేష్ 'మహర్షి' టీజర్.

సూపర్ స్టార్ మహేష్ మరియు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా మహర్షి. ముగ్గురు పెద్ద ప్రొడ్యూసర్లు (దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి) కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. అల్లరి నరేష్ కూడా ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న విషయం తెలిసిందే. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మే 9న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు.

ఇక ఈ సినిమాకు సంబందించిన టీజర్ ప్రేక్షకులకు ఉగాది కానుకగా ఈరోజు రిలీజ్ చేశారు. మహర్షి సినిమాపై భారీగా అంచనాలు పెంచేలా టీజర్ ఉంది. అయితే టీజర్ లో హైలెట్స్ గా చెప్పుకుంటే మహేష్ లుక్ అదిరిపోగా. ఆ తర్వాత సూటు బూటు వేసుకుని స్టైలిష్ గా ఓ పక్క మాస్ లుక్ లో మరోపక్క క్లాస్ లుక్ లో కనిపించాడు. టీజర్ లో సక్సెస్ ఈజ్ నాటే డెస్టినేషన్. సక్సెస్ ఈజ్ ఏ జర్నీ అంటూ రిషి జర్నీలో అందరు పాల్గొనాలని చెప్పాడు.

అయితే సినిమాలో యాక్షన్ పార్ట్ లో తోటలో ఫైట్ సీన్ మాత్రం శ్రీమంతుడు సినిమాలో మహేష్ ను తలపిస్తుంది. సేమ్ ఫైట్ జస్ట్ లుక్ మారింది అంటే అనేలా ఉంది. వంశీ పైడిపల్లి ఎంతో జాగ్రత్తగా చేస్తున్న ఈ మహర్షి మీద చిత్రయూనిట్ మొత్తం ఫుల్ కాన్ ఫిడెంట్ గా ఉన్నారు. మరి మహేష్ మహర్షి ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

 



Source link

Related posts

డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్!

Oknews

ఫ్యాన్సీ రేటుకు 'లగ్గం' ఆడియో రైట్స్ !

Oknews

ఇది కదా మెగా ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్ అంటే!

Oknews

Leave a Comment