posted on Jun 21, 2024 10:38AM
నీరు శరీరానికి ఇంధనం వంటిది. గోరు వెచ్చని నీరు తాగడం వల్ల శరీరం చాలా వరకు ఆరోగ్యంగా ఉంటుంది. కొందరు ఉదయాన్నే గోరు వెచ్చని నీరు తాగుతారు. దీనివల్ల శరీరం శుద్ది అవుతుందని, శరీరంలో టాక్సిన్లు బయటకు వెళతాయని అంటారు. అంతే కాదు ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగడం వల్ల జీర్ణాశయం శుభ్రం అవుతుంది. పేగులు శుభ్రపడతాయి. మలబద్దకం సమస్య తగ్గుతుంది. మోషన్ ఫ్రీగా అవుతుంది. కానీ రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని నీరు తాగడం వల్ల కలిగే లాభాలు ఏంటో మీకు తెలుసా?
రాత్రిపూట వేడినీరు తాగడం వల్ల ఒత్తిడి తగ్గి మంచి నిద్ర వస్తుంది. రాత్రిపూట వేడినీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది, ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. జలుబు లేదా ఫ్లూ సమస్య ఉన్నట్లయితే వేడి నీరు తాగడం వల్ల మూసుకుపోయిన ముక్కును క్లియర్ చేయడంలో, గొంతు నొప్పిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా రాత్రంతా హైడ్రేటెడ్ గా ఉండటం వల్ల గ్యాస్, ఉబ్బరం సమస్యను కూడా పరిష్కారమవుతుంది.
గోరువెచ్చని నీటిని తాగడం వల్ల శరీరం డిటాక్స్ అవుతుంది. రాత్రిపూట గోరువెచ్చని నీటిని తాగితే ఉదయాన్నే శరీరంలోని టాక్సిన్స్‌ను సులభంగా బయటకు పంపుతుంది.
రాత్రి భోజనం చేసిన అరగంట తర్వాత లేదా నిద్రకు ఒకటి లేదా రెండు గంటల ముందు గోరువెచ్చని నీటిని తాగాలి. రాత్రిపూట జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటుంది. కాబట్టి గోరువెచ్చని నీటిని తాగడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. జీర్ణక్రియ బాగా జరుగుతుంది.
రాత్రిపూట గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల మలబద్ధకం, అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
తరచుగా ఒత్తిడికి గురయ్యేవారు రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిని తాగాలి. ఇది ఒత్తిడిని, నిస్పృహను తగ్గిస్తుంది. హాయిగా నిద్ర పొందడానికి కూడా సహాయపడుతుంది.
వేడి నీటిని తాగడం వల్ల మెటబాలిజం స్థాయిలు వేగంగా పెరుగుతాయి. ఆరోగ్యంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. శరీరంలో అదనపు కొవ్వు బర్న్ చేయడంలో సహాయపడుతుంది.
*రూపశ్రీ.