ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు బ్రేక్ పడింది. ఏప్రిల్ 3 వరకు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. సినిమా నిర్మాత, దర్శకుడికి కోర్టు నోటీసులు పంపించింది. ఏప్రిల్ 3న సాయంత్రం 4 గంటలకు సినిమాను జడ్జీల ముందు ప్రదర్శించాలని ఆదేశించింది. సినిమా చూసిన తర్వాత నిర్ణయం వెల్లడిస్తామని హైకోర్టు తెలిపింది. రేపు సినిమాను విడుదల చేయాలని చిత్రయూనిట్ ప్లాన్ చేసుకుంది. అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలపై హైకోర్టు స్టే విధించడం చర్చనీయాంశమైంది. అయితే రామ్ గోపాల్ వర్మ మేము సుప్రీం కోర్టు కి వెళతాం అని తన ట్విట్టర్ కథా నుంచి తెలిపారు.
ఎన్టీఆర్ జీవితంలో జరిగిన కీలక సంఘటనలకు సంబంధించిన అసలు నిజాలను ఈ సినిమాతో చూపిస్తానని వర్మ చెప్పటం అదేవిదంగా టీడీపీ నాయకులు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని విడుదల కాకుండా ఆపేందుకు ప్రయత్నాలు చేస్తుండటంతో సినిమా మీద ప్రేక్షకుల బాగా ఆసక్తి పెరిగింది.