EntertainmentLatest News

సిల్క్ స్మిత పై బాలకృష్ణ కామెంట్స్..ఓల్డ్ ది అంటున్న ఫ్యాన్స్ 


ఎక్కడ కొట్టుకుందాం. సంగం, శరత్, జగదాంబ, ఈ ఒంటి మీద ఖాకీ చొక్కా ఉన్నంత సేపే నేను పోలీసుని లేదంటే నీ కంటే పెద్ద రౌడీని…..నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చెయ్యాలి, లేదంటే నీకు నెక్స్ట్ బర్త్ డే ఉండదు….. ఒరే వీర రాఘవరెడ్డి నీ ఇంటికి వచ్చా నీ నట్టింటికి వచ్చా…. కత్తులతో కాదు కంటి చూపుతో చంపేస్తా…. నీకు బీపీ వస్తే నీ పి ఏ వణుకుతాడు, నాకు బిపి వస్తే స్టేట్ వణుకుద్ది….ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు… ఈ డైలాగ్స్ ఏ హీరో చెప్పాడని అడగడం  పెద్ద  దుస్సాహసమే అవుతుంది. అంతలా నందమూరి నట సింహం బాలకృష్ణ (balakrishna)తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాడు. సిల్వర్ స్క్రీన్ మీద శత్రువుల ఆటకట్టించడానికి మాత్రమే అలా మాట్లాడతాడు.కానీ  ఆఫ్ ది స్క్రీన్ మాత్రం ఎంతో మంచి హృదయంతో ఉంటాడు. ఇందుకు నిదర్శనమే సోషల్ మీడియాలో ప్రెజంట్    ట్రెండ్ అవుతున్న ఒక వీడియో.

బాలకృష్ణ  గతంలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఏది చెప్పినా బల్ల గుద్దినట్లు నిక్కచ్చిగా నిష్కలమైన మనసుతో  చెప్పడం బాలయ్య స్టైల్. ఇప్పుడు దివగంత నటి డాన్సర్ అయినటువంటి  సిల్క్ స్మిత (silk smitha)గురించి కూడా అలాగే చెప్పాడు. ఇండస్ట్రీలో మేకప్, కాస్ట్యూమ్స్ విషయంలో సిల్క్ స్మితను ఢీకొట్టే ఆడదే లేదు. అందరికంటే చాలా డిఫరెంట్ గా కనిపించేది. ఆమె వాడే మేకప్ ప్రొడక్ట్స్ ఏంటనే విషయాన్నీ తెలుసుకోవడానికి చాలామంది హీరోయిన్లు ప్రయత్నించే వారని చెప్పాడు. ఈ ఓల్డ్ వీడియో లేటెస్ట్ గా  సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

బాలకృష్ణ సిల్క్ స్మిత కలిసి  ఆదిత్య 369 లో నటించారు. శ్రీ కృష్ణ దేవరాయల ఆస్థానంలో ఉండే నృత్య కారిణిగా  సిల్క్ స్మిత చాలా అద్భుతంగా చేసింది. పైగా బాలయ్య మీద మనసు కూడా  పారేసుకుంటుంది. ఇక  ఆ ఇద్దరి మధ్య తెరకెక్కిన  జాణవులే నెరజాణవులే సాంగ్ అయితే నభూతో న భవిష్యత్తు. అప్పట్లో ఒక ట్రెండ్ ని కూడా  సృష్టించింది. నేటికీ కూడా చాలా చోట్ల మారుమోగిపోతుంటుంది. ఇక  కోట్లాది  మంది అభిమానులలో విషాదాన్ని నింపుతు  సిల్క్ స్మిత  1996 సెప్టెంబర్ 23 న  ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కి దగ్గరలోని కొవ్వాలి ఆమె జన్మ స్థలం. 

 



Source link

Related posts

Telangana Election 2023 CM KCR Announced Nama Nageswara Rao As Khammam BRS MP Candidate

Oknews

RTC ITI: టిఎస్‌ఆర్టీసీ ఐటిఐ కాలేజీకి డీజీటీ అనుమతులు మంజూరు, ప్రవేశాలు షురూ

Oknews

Zomato new service for veg customers pure veg fleet with green color theme

Oknews

Leave a Comment