మాములుగా మ్యాచులంటేనే ఓ రకమైన టెన్షన్ ఉంటుంది. అలాంటిది వరల్డ్ కప్ లాంటి పెద్ద స్టేజ్ మ్యాచుల్లో కాళ్లు వణికిపోతూ ఉంటాయి. మరి అందులోనూ 90 పరుగులకే కళ్ల ముందే 4వికెట్లు పడిపోయాయి. దాదాపుగా బ్యాటర్లంతా అవుటైపోయారు. ఆఫ్గాన్ లాంటి చిన్న టీమ్ మీద కుప్పకూలిపోతే దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఇలాంటి టెన్షన్ సిచ్యుయేషన్ ఉంటే కూల్ గా నిలబడిపోయాడు మన మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్. అసలు ఇది పెద్ద మ్యాచే కాదన్నట్లు తనదైన ఆటిట్యూడ్ అండ్ స్వాగ్ చూపిస్తూ కాబూలీ బౌలర్లను ఉతికిపారేశాడు. 28 బంతుల్లో 5ఫోర్లు, 3సిక్సర్లు బాది 53పరుగులు చేశాడు. అవి కూడా ఏదో గుడ్డి షాట్లు కావు. చాలా ఫర్ఫెక్ట్ టైమింగ్ తో తనదైన లాఫ్టెడ్ షాట్స్ తో చూడముచ్చటగా కొట్టాడు. మరో వైపు పాండ్యా సహకారం తీసుకుంటూ చక్కగా స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ మ్యాచ్ ను తుదికంటా తీసుకువచ్చాడు. బ్యాట్ ఝుళిపించాల్సిన సమయం వచ్చినప్పుడు రెచ్చిపోయాడు. 17ఓవర్ చివరి బంతికి అవుటైన పాండ్యా అప్పటికే స్కోరు బోర్డును సెట్ రైట్ చేసి వెళ్లిపోయాడు. అంతటి టెన్షన్ సిచ్యుయేషన్ లోనూ అంత కూల్ గా బబుల్ గమ్ నములుతూ ఎలా ఆడతారని బ్యాటింగ్ తర్వాత సూర్యాను అడిగితే ఇలాంటి మ్యాచులు ఆడటం.. మిడిల్ ఓవర్లలో ప్రెజర్ ఫేస్ చేయటం అలవాటైపోయందంటూ నవ్వేశాడు. కొహ్లీ అవుటైనప్పుడు బబుల్ గమ్ ను గట్టిగా నమిలేశానని కాసేపటికి తర్వాత టెన్షన్ తగ్గించుకుని నా స్టైల్ లో ఆడేశానని అన్నాడు. ముంబై ఇండియన్స్ కి, టీమిండియాకి రోహిత్ శర్మ తో కలిసి చాలా క్రికెట్ ఆడానన్న సూర్యా…పరిస్థితులు అటూ ఇటూ అవుతున్నప్పుడు బబుల్ గమ్ నవ్వుతూ కూల్ గా తను ఎలా ఆడతానో రోహిత్ కు తెలుసని..అందుకే అతను అవుటైపోయానా టెన్షన్ పడకుండా రిలాక్స్డ్ గా మ్యాచ్ చూస్తాడని చెప్పి తన మీద తనకున్న నమ్మకాన్ని ప్రకటించుకున్నాడు సూర్యా భాయ్.
క్రికెట్ వీడియోలు
Suryakumar Yadav vs Afg Super 8 | ఆఫ్గాన్ పై భారత్ ను నిలబెట్టిన సూర్యా భాయ్ | T20 World Cup 2024
మరిన్ని చూడండి