Entertainment

chinmayi sripada comments wiral social media


నీతో ఒక రాత్రి గడపడానికి ఎంత తీసుకుంటావు?

సింగర్ మరియు డ‌బ్బింగ్ ఆర్టిస్టుగా చిన్మ‌యి మంచిపేరు సంపాదించుకుంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఆమె అన్ని విష‌యాల్లోనూ ఎంతో చురుగ్గా, బోల్డుగాఉంటుంది. అప్పుడప్పుడూ సోష‌ల్ మీడియాలో ఘాటు వ్యాఖ్య‌లు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మ‌రోసారి అలాంటి సంచ‌ల‌న వ్యాఖ్యలే చేసి వైర‌ల్ అవుతున్నారు.

“ఎవరైనా ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడమే లేక చనిపోయినప్పుడో జనాలు అయ్యో పాపం అంటారు కాని అదే అమ్మాయికి అన్యాయం జరుగుతుందని ఒక్కరు కూడా ముందుకు రారు, తనకి అన్యాయం జరిగిందని మీడియా ముందుకు వస్తే తనదే తప్పు అన్నట్లుగా భావిస్తారు జనాలు. ప్రస్తుతం అవన్ని నేను అనుభవిస్తున్నాను. నన్ను ఇప్పుడు చెడుగా విమర్శలు చేస్తున్న వారందరికి నేను ఒకే ప్రశ్న వేస్తాను.. మీకు అమ్మ అక్క చెల్లి లేరా? వారిని కూడా ఇలాగే చూస్తారా”… అంటూ నిల‌దీసింది.

అంతేకాకుండా తనను దూర్భాషలాడుతూ ట్రోలింగ్ చేస్తున్నారనీ, ‘నాతో పడుకోవడానికి ఎంత తీసుకుంటావు’ అని పిచ్చిపిచ్చి సందేశాలతో వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొందరైతే తనను వ్యభిచారిణి అంటూ దూషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి లైంగిక వేధింపులు ఒక్క సినిమాలోనే కాకుండా బయట ప్రపంచంలో కూడా చాలా జరుగుతున్నాయని చాలామంది దోషులు తప్పులు తప్పించుకు తిరుగుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

దాంతో చిన్మ‌యి తాజా పోస్ట్ క‌ల‌క‌లం రేపుతోంది. పెద్ద చ‌ర్చ‌కు తెర‌లేపుతోంది. భార‌తీయ భాష‌ల‌న్నింటిలోనూ చిన్మ‌యికి అభిమానులున్నారు. వివిధ భాష‌ల్లో ఎంట్రీ ఇచ్చిన ఆమెకు సోష‌ల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక తాజా ట్వీట్ తో ఆమె పెద్ద చ‌ర్చ‌కు ఆస్కారం ఇచ్చిన‌ట్ట‌య్యింది.

 



Source link

Related posts

అల్లు అర్జున్ పై నాని సంచలన కామెంట్స్ అందుకు నాంది పలకనుందా!

Oknews

పోసానికి మోహన్ బాబు మాస్ వార్నింగ్!

Oknews

బిగ్‌బాస్‌ బ్యూటీపై కాంగ్రెస్‌ కార్యకర్తల దాడి!

Oknews

Leave a Comment