Entertainment

prabhu deva got padmashri – Telugu Shortheadlines


స్టెప్పుకి దక్కిన  మెప్పు

డ్యాన్స్‌లో సరికొత్త ట్రెండ్‌ని తీసుకొచ్చి దక్షిణాది, ఉత్తరాది తారలతో ఉర్రూతలూగించే స్టెప్పులేయించిన ‘ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌’ అనిపించుకున్నారు ప్రభుదేవా. తండ్రి సుందరం మాస్టారుని ఆదర్శంగా తీసుకుని, ఆయన దగ్గరే సహాయకుడిగా చేసి, ఆ తర్వాత నృత్యదర్శకుడిగా మారారు ప్రభుదేవా. 13 ఏళ్ల వయసులో తొలిసారి ‘మౌనరాగం’(1986) చిత్రంలో ఫ్లూట్‌ వాయించే కుర్రాడిగా ఓ పాటలో కనిపించిన ప్రభుదేవా ఆ తర్వాత ‘అగ్ని నక్షత్రం’ అనే సినిమాలో బ్యాగ్రౌండ్‌ డ్యాన్సర్‌గా చేశాడు.

‘ఇదయం’ (1991) (తెలుగులో ‘హృదయం’)లో చేసిన స్పెషల్‌ సాంగ్‌ ‘ఏప్రిల్‌ మేయిలే..’ అప్పటి కుర్రకారుని ఉర్రూతలూగించింది. ఇక ‘జెంటిల్‌మేన్‌’లో ‘చికుబుకు చికుబుకు రైలే…’ సాంగ్‌లో ప్రభుదేవా వేసిన స్టెప్స్‌ సూపర్‌ అననివాళ్లు లేరు. ఇతర హీరోల చిత్రాల్లో ప్రత్యేక పాటలు చేయడంతో పాటు పలువురు అగ్రహీరోల చిత్రాలకు నృత్యదర్శకుడిగానూ చేశారు ప్రభుదేవా. 16 ఏళ్ల వయసులో తొలిసారి నృత్యదర్శకుడిగా కమల్‌హాసన్‌ ‘వెట్రి విళా’కి చేసిన ప్రభుదేవా ఆ తర్వాత నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేనంత బిజీగా అయ్యాడు. రజనీ ‘దళపతి’లోని ‘చిలకమ్మా చిటికెయ్యంట…’, చిరంజీవి నటించిన ‘రౌడీ అల్లుడు’, ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’… వంటి చిత్రాలతో పాటు రీ–ఎంట్రీ మూవీ ‘ఖైదీ నం. 150’ వరకూ ప్రభుదేవా పలు చిత్రాలకు కొరియోగ్రఫీ చేశారు.

నాగార్జునతో ‘విక్రమ్, కెప్టెన్‌ నాగార్జున’ వంటి చిత్రాలకు, బాలకృష్ణ, వెంకటేశ్‌ .. ఇలా అగ్రహీరోలందరితో కొత్త స్టెప్పులు వేయించారు. ఒకవైపు నృత్యదర్శకుడిగా కొనసాగుతూ నటుడిగా మారారు ప్రభుదేవా. దర్శకుడు పవిత్రన్‌ ‘ఇందు’ చిత్రంలో ప్రభుదేవా తొలిసారి లీడ్‌ రోల్‌ చేశారు. శంకర్‌ ‘ప్రేమికుడు’ హీరోగా ప్రభుదేవాకు పెద్ద బ్రేక్‌. ఆ సినిమాలో ‘ముక్కాలా ముక్కాబులా..’, ‘ఊర్వశీ ఊర్వశీ.. టేకిట్‌ ఈజీ పాలసీ..’ పాటలకు ప్రభుదేవా వేసిన స్టెప్స్‌ని నేటి తరం కూడా ఫాలో అవుతోంది. ‘మెరుపు కలలు’, ‘సంతోషం’..వంటి చిత్రాలతో పాటు డ్యాన్స్‌ బేస్డ్‌ మూవీస్‌ ‘స్టైల్‌’, ‘ఎబిసిడి’ వంటి చిత్రాలు కూడా చేశారు.

 



Source link

Related posts

రొమాంటిక్ దర్శకుడితో 'బింబిసార-2' ప్రకటన!

Oknews

తెలుగులో 'ప్రేమలు'.. రంగంలోకి జక్కన్న కుమారుడు!

Oknews

ఇష్టం కలిగేలా చేసింది మీరే…తగ్గేదేలే అంటున్న రష్మిక 

Oknews

Leave a Comment