బహుశా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (ram charan)కెరీర్ లో ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. రన్నింగ్ లో ఉన్న సినిమా గురించి కాకుండా ఇంకా షూటింగ్ ప్రారంభం కానీ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం. అదేనండి రామ్ చరణ్,బుచ్చి బాబు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఆర్ సి 16 .మెగా ఫాన్స్ అండ్ ప్రేక్షకులు కూడా ఈ మూవీ అప్ డేట్ మీద ఒక కన్నేసి ఉంచారు. ఈ క్రమంలోనే వస్తున్న ఒక న్యూస్ చరణ్ మీద వాళ్ల అభిమానాన్ని రెట్టింపు అయ్యేలా చేస్తుంది.
మొన్న మార్చిలో ఆర్ సి 169(rc 16) ని పూజా కార్యక్రమాలతో అధికారకంగా ప్రారంభించారు.. వీలైనంత త్వరగానే షూటింగ్ ని ప్రారంభించాలనుకున్నారు. కానీ గేమ్ చేంజర్ వల్ల లేట్ అవుతు వస్తుంది. తాజా సమాచారం ప్రకారం చరణ్ గేమ్ చేంజర్(game changer)కి ఇంకో పది రోజుల్లో గుమ్మడి కాయ కొట్టనున్నాడని తెలుస్తుంది. ఆ తర్వాత తన పార్ట్ వరకు డబ్బింగ్ ని పూర్తి చేసి ఆర్ సి 16 కోసం ఆస్ట్రేలియా బయలుదేరుతాడనీ అంటున్నారు. స్పోర్ట్స్ కి సంబంధించిన మూవీ కావడంతో అందుకు సంబంధించిన కసరత్తులని తీసుకోవడానికే చరణ్ ఆస్ట్రేలియా వెళ్లనున్నాడు. రెండు నెలల పాటు అక్కడే ఉంటాడు.
ఇక సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ కావడంతో మెగా ఫ్యాన్స్ చెర్రీ కి హెల్త్ విషయంలో జాగ్రత్తలు చెప్తున్నారు. ఎందుకంటే గేమ్ చేంజర్ కోసం ఎంతగా కష్టపడుతున్నాడో చూస్తూనే ఉన్నారు. పైగా శంకర్(shankar)మూవీ అంటే ఎంతటి కష్టం ఉంటుందో అందరకి తెలిసిందే. మరి ఇప్పుడు వెంటనే ఆస్ట్రేలియాలో కసరత్తులు అంటున్నాడు కాబట్టి జాగ్రత్తలు చెపుతున్నారు.ఇక కొన్ని రోజుల క్రితం తన కూతురు క్లీంకార ని వదిలి ఉండలేకపోతున్నాని చెప్పాడు.మరి తనని కూడా తీసుకెళ్తాడేమో చూడాలి.