GossipsLatest News

బాలీవుడ్ హీరోయిన్ మెహిందీ వేడుకలు


బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా పెళ్లి పీటలెక్కేందుకు సిద్దమైంది. వారం రోజుల క్రితం బ్యాచిలరేట్ పార్టీ చేసుకున్న సోనాక్షి తాను ఇష్టపడిన జ‌హీర్ ఇక్భాల్ తో కలిసి వివాహ బంధంలో అడుగుపెట్టేందుకు రెడీ అయ్యింది. మరి బాలీవుడ్ సెలబ్రిటీస్ పెళ్లిళ్లు అంటే మీడియా అటెన్షన్ మొత్తం ఆ పెళ్లి పైనే ఉంటుంది. ఇప్పుడు మీడియా మాత్రమే కాదు సోనాక్షి పెళ్లి వేడుకలు ఎలా జరగబోతున్నాయి, ఎక్కడ జరగబోతున్నాయని నెటిజెన్స్ కూడా ఆతృతగా సోషల్ మీడియాని వెతికేస్తున్నారు.

సోనాక్షి సిన్హా పెళ్లి వేడుకల్లో భాగంగా గత రాత్రి గ్రాండ్ గా మెహందీ వేడుక జ‌రిగింది. సోనాక్షి మెహిందీ వేడుక‌కు సంబంధించి ఫోటోలు కొన్ని నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఈ సెలెబ్రేషన్స్ లో సోనాక్షి సిన్హా త‌న స్నేహితులు, స‌న్నిహితుల‌తో క‌లిసి కొన్ని ఫోటోల‌కు ఫోజులిచ్చారు. సోనాక్షి ప్రీ వెడ్డింగ్ పార్టీ లో సన్నిహితులు, స్నేహితులు, చుట్టాలతో ఇల్లంతా సందడిగా మారగా.. పెళ్లి కుమార్తె ఇంటిని  ఎంతో అందంగా అలంక‌రించారు. పూల తోర‌ణాల‌తో, విద్యుత్ కాంతులతో ఇల్లంతా మెరిసిపోతుంది. 

రేపు ఆదివారం జరగబోయే సోనాక్షి సిన్హా- జ‌హీర్ ఇక్భాల్ ల వివాహం కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితులు, స్నేహితుల స‌మ‌క్షంలోనే జ‌రుగుతంద‌ని స‌మాచారం. బాలీవుడ్ నుంచి త‌మ‌కు బాగా స‌న్నిహితంగా మెలిగే సెలబ్రిటీస్ మాత్రమే హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంది అని తెలుస్తోంది.

ఇక కుమార్తె సోనాక్షి పెళ్లి ఇష్టం లేదు అన్నట్టుగా ఈమధ్యన శత్రుజ్ఞ సిన్హా మాట్లాడారు. కానీ ఇప్పుడు మాత్రం తనకి ఈ పెళ్లి ఇష్టమే, జ‌హీర్ ఇక్భాల్-సోనాక్షి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి, నేను తప్పకుండా ఈ పెళ్ళికి హాజరవుతాను, వారి జోడీ చాలా బాగుంది. వారు ఇద్దరూ కలిసి గొప్ప జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నా అంటూ ఆయన ఈ పెళ్లిపై ఓపెన్ అయ్యారు. 



Source link

Related posts

Allu Arjun Talks About Pushpa 3 పుష్ప3 కూడా ఉంటుంది: అల్లు అర్జున్

Oknews

వేయి స్తంభాల గుడిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పూజలు

Oknews

Karimnagar News A Man Protesting By Tying A Chicken Carcass To The Gate Of Kothapalli Municipal Office In Karimnagar District. | Viral News: మున్సిపల్ ఆఫీస్‌ గేట్‌కు కోడి కట్టి నిరసన

Oknews

Leave a Comment