దిశ, ఫీచర్స్ : సముద్రాల్లో, పెద్ద పెద్ద నదుల్లో కనిపించే డాల్ఫిన్‌లు సహజంగానే బ్లాక్ కలర్‌లో ఉంటాయి. అరుదుగా కొన్ని గ్రే కలర్, బ్లూ కలర్‌లో ఉంటాయి. కానీ ఎన్నడూ లేనివిధంగా అమెరికాలోని నార్త్ కరోలినా తీరంలో ఓ పింక్ కలర్ డాల్ఫిన్ దర్శనమిచ్చిందని ఎక్స్(ట్విట్టర్)లో ఓ యూజర్ పోస్ట్ చేయగా క్షణాల్లో వైరల్ అయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. నెటిజన్లు మాత్రం పింక్ కలర్ డాల్ఫిన్‌లు నిజంగానే ఉంటాయా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరేమో వైరల్ అవుతున్న గులాబీ రంగు డాల్ఫిన్ అసహజమైన ప్లాస్టిక్ కలర్ మాదిరి ఉందని, అది ఏఐ ద్వారా క్రియేట్ చేయబడిన ఫొటో కావచ్చునని కామెంట్స్ చేస్తున్నారు.
ప్రజెంట్ ఈ వైరల్ పింక్ డాల్ఫిన్స్‌పై నెటిజన్లు క్యూరియాసిటీతో డిస్కస్ చేస్తున్నారు. ఇక ఓ యూజర్ అయితే ఏఐ క్రియేషన్ కాదని, పింక్ కలర్ డాల్ఫిన్ కొన్నేండ్ల క్రితం లూసియానా దగ్గర కనిపించిందని, ఆల్బినో డాల్ఫిన్లు చాలా రేర్‌గా ఉంటాయని పేర్కొన్నాడు. మరో యూజర్ నమ్మశక్యంగా లేదని సందేహం వ్యక్తం చేశాడు. అయితే కొందరు నిపుణుల ప్రకారం.. పింక్ డాల్ఫిన్లు ఎక్కువగా కనిపించవు. కానీ ఈ భూ ప్రపంచంలో అవి నిజంగానే ఉన్నాయని చెప్తున్నారు. వాటిని అమెజాన్ రివర్ డాల్ఫిన్స్ లేదా బోటోస్ అని పిలుస్తారట. సౌత్ అమెరికాలోని అమెజాన్, ఓరినోకో బేసిన్లలోని మంచి నీటి నదులు, ఉపనదులలో పింక్ కలర్ డాల్ఫిన్‌లు అరుదుగా కనిపిస్తుంటాయి. వయస్సు, ఆహారం, సూర్యరశ్మి వంటి అంశాలు వాటి కలర్ ప్రభావితం అవుతందని నిపుణులు చెప్తున్నారు.