Andhra Pradesh

మేం చేస్తాం.. మీరు చేయకూడదు


రాజకీయం అంటే ఇలానే వుంటుంది. మేం ఆక్రమించవచ్చు. కానీ మీరు చేయకూడదు. కొండ తవ్వేసి పార్టీ ఆఫీసులు తాము కట్టుకోవచ్చు. వీళ్లు కట్టుకోకూడదు. అవును రాజకీయం ఇలాగే వుంటుంది. ఎన్టీఆర్ సిఎమ్ గా వున్నారు. ముషిరాబాద్ లో రామకృష్ణ స్టూడియో వుండేది. అక్కడ ట్రాఫిక్ పెరిగింది. దానికి బదులుగా ఊరు అవతల ఆర్ కె హార్టి కల్చర్ స్టూడియో కడుతున్నాం. అందువల్ల ఈ పాత స్టూడియోని కమర్షియల్ గా వాడుకోవడానికి అనుమతి ఇవ్వమని కోరారు. అనుమతి ఇచ్చారు.

ఇక్కడ విషయం ఏమిటంటే

అనుమతి కోరింది స్టూడియో అధినేత ఎన్టీఆర్. అనుమతి ఇచ్చింది సిఎమ్ ఎన్టీఆర్. అప్పట్లో ఈ మేరకు పలు విమర్శలు వినిపించాయి.

ఈపాటి చిన్న లోకజ్ఙానం లేకపోయింది జగన్ కు. 13 జిల్లాల్లో సాక్షి ఆఫీసుల మాదిరిగా ఒకే డిజైన్ తో వైకాపా పార్టీ ఆఫీసులు కట్టుకోవాలనే ఆలోచన వరకు ఓకె. కానీ పార్టీ తరపున ప్రోపర్ గా అనుమతి కొరడం, పద్దతిగా అనుమతులు ఇవ్వడం, ప్లాన్ అప్రూవల్స్ తీసుకోవడం చేయాలి కదా. అప్పుడు కదా తరువాత వచ్చే ప్రభుత్వం చేతికి తమ జుట్టు అందదు.

కానీ అలా కాకుండా 2024లో మనమే అధికారంలోకి వస్తే, మనల్ని అడిగేవాడు ఎవరు? మన బిల్డింగ్ ను టచ్ చేసేవాడు ఎవరు అనుకుంటే ఏం లాభం?

తెలుగుదేశం పార్టీ కూడా ఎకరా 1000 రూపాయలకే లీజుకు తీసుకుంది. బిల్డింగ్ లు కట్టకుంది. అయితే మీరు కూడా అదే పని చేస్తారా? చేస్తే చేసారు. వాళ్లు చేసినట్లుగానే పద్దతిగా చేయాలి కదా. ఈ ప్యాలస్ మోడల్ డిజైన్ పిచ్చి ఏమిటి? ఇప్పుడు మీరు చేసారు. అంటూ ఆలస్యంగా ఎదురు దాడి చేస్తే తేదేపా సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏమంటాయి? మేం తప్పు చేసాం.. మీరు చేస్తారా? అంటాయి. లేదా మీరు తప్పు చేసారని ఒప్పుకుంటున్నారా? అంటాయి.

దీనంతటికి ఒకటే కారణం. 2024లో తానే అధికారంలోకి వస్తాననే మితిమీరిన నమ్మకం. తన ప్రభుత్వంలో తనే ఒక కాగితం ముక్క అనుమతికి పెట్టి, తానే అనుమతి ఇవ్వకపోవడం.



Source link

Related posts

Pvt School Permissions: ఏపీలో ప్రైవేట్ స్కూళ్లకు ఇకపై ఆన్‌లైన్‌లో‌నే అనుమతులు

Oknews

షాకింగ్.. అమెరికా అధ్యక్షుడు ఎక్కడ? Great Andhra

Oknews

ఏపీ టెట్ ఫలితాలు, డీఎస్సీ నిర్వహణకు ఈసీకి ప్రభుత్వం లేఖ-అనుమతి రాగానే హాల్ టికెట్లు జారీ!-amaravati ap govt wrote letter to ec permission for tet results dsc exams as per schedule ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment