విరాట్ కొహ్లీ. మోడ్రన్ డే క్రికెట్ లో ఎదురులేని మొనగాడు. అలాంటోడిని బల్ల కింద దూరి బాల్ తీసుకోమన్నారు. ఇది నిజంగా నిజం నిన్న బంగ్లా దేశ్ తో జరిగిన గ్రూప్ A సూపర్ 8 మ్యాచ్ లో జరిగింది. భారత్ విసిరిన 197పరుగుల లక్ష్య ఛేదన కోసం ఆడుతున్న బంగ్లాదేశ్ బ్యాటర్లు ఆడుతున్నారు. 17వ ఓవర్ లో బంగ్లా బ్యాటర్ రిషద్ హొస్సేన్ ఓ భారీ సిక్సర్ కొట్టాడు. డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్స్ వెళ్లిన ఆ బాల్ బౌండరీ బయట ఉన్న పోడియం కిందకు వెళ్లిపోయింది. మన ఇండియాలా కాదుగా పది మంది ఉండటానికి బాల్స్ ఇవ్వటానికి అది వెస్టిండీస్. గల్లీ క్రికెట్ లో మనం కొడితే మనమే తెచ్చుకోవాలి అన్నట్లు ఉంటుంది అక్కడ పరిస్థితి. ఆ పోడియం కింద బాల్ ఎక్కడ దూరిందో తెలియక కింగ్ విరాట్ కొహ్లీ ఫస్ట్ వంగి చూశాడు. అయినా కనపడకపోవటంతో ఈ సారి పోడియం కింద గ్రిల్స్ లోకి దూరేసి మరీ వెతికాడు. ఆఖరికి బాల్ కనిపెట్టి దాన్ని పట్టుకుని జాగ్రత్తగా బయటకు తీసుకువచ్చాడు. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. కింగులాంటోడిని బల్ల కింద దూరి బాల్ తీసుకోమంట్రారా అని విరాట్ ఫ్యాన్స్ ఫీలైపోతుంటే…బాల్ అంత లోపలికి వెళ్లినా అక్కడ హెల్ప్ చేయటానికి ఎవరూ రాకపోవటాన్ని మరికొంత మంది క్వశ్చన్ చేస్తున్నారు. ఇంకొంత మంది ఫ్యాన్స్ అయితే మా అన్న ఫిట్ నెస్ చూడండి..అంత చిన్నగ్రిల్ లోకి ఎలా దూరిపోయాడో అదీ కింగ్ ఫిటెనెస్ లెవల్స్ అంటే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి మీ కామెంట్ ఏంటీ ఈ వీడియోపై.
క్రికెట్ వీడియోలు
Virat Kohli Searching For Ball | T20 World Cup 2024 Ind vs Ban మ్యాచ్ లో ఫన్నీ సీన్ | ABP Desam
మరిన్ని చూడండి