జగన్ మోహన్ రెడ్డి సింహం సింగిల్ గా వస్తుంది అంటూ ఈ 2024 ఎన్నికల్లో తన గెలుపు ఖాయమని పొత్తు పెట్టుకున్న కూటమిని చూసి ఎక్కిరిస్తూ ఎన్నికల బరిలో ఘోరమైన ఓటమిని చవి చూడడానికి ప్రధాన కారణం జగన్ అహంకారమేనట. ఇది ఏ టీడీపీ కార్యకర్తలో, లేదంటే టీడీపీ నేతలో, సీఎం చంద్రబాబో అన్నదో కాదు.. స్వయానా జగన్ పెంచి పోషించిన బ్లూ మీడియా మాట్లాడుతున్న మాటలే.
జగన్ మోహన్ రెడ్డి అన్ని తానే అన్నట్టుగా వైసీపీ ప్రభుత్వంలో వ్యవహరించారు. కేడర్ ని కాదు కనీసం తనకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చిన ఎమ్యెల్యేలని, మంత్రులని కూడా పట్టించుకోలేదు అనే మాట ఓటమి పాలైనదగ్గర నుంచి కనిపిస్తుంది, వినిపిస్తోంది. అధికారంలో ఉన్నాం కదా పక్కనోళ్లతో పనేంటి అని సొంత వాళ్లకే దూరమైన జగన్ మోహన్ రెడ్డి ఓటమి చవి చూసాక కూడా ఆయన మారలేదంటుంది బ్లూ మీడియా.
అధికార పక్షంలో ఉన్నా, ప్రతి పక్షం లో ఉన్నా జగన్ ఇంకా అహంకారంతోనే, స్వార్ధం తోనే కనిపిస్తున్నాడంటుంది. జగన్ కట్టించిన వైసీపీ పార్టీ ఆఫీస్ లని కూలదోస్తుంటే సొంత పార్టీ వారు తప్ప ఇతరులెవ్వరూ దానిపై మాట్లాడకపోవడమే జగన్ రాజకీయ ఒంటరితనాన్ని నిరూపిస్తుంది. ఇది అహంకారానికి నిదర్శనమని అంటుంది. బీజేపీ తో టీడీపీ పొత్తు పెట్టుకుని లాభపడింది. కానీ జగన్ మోడీ, అమిత్ షా తో పార్టీ పరంగా కాకుండా పర్సనల్ అనుబంధాన్ని మైంటైన్ చేసారు, అది పార్టీ కి ఏ మాత్రం సంబందం లేకపోవడం కూడా జగన్ అహంకారమే కారణం.
రాజకీయాల్లో కొన్నిసార్లు పొత్తు అవసరం. కానీ రాజకీయాల్లో జగన్ ఒంటరి ప్రయాణం అతనికే ముప్పుని తెచ్చిపెట్టింది. సింహం సింగిల్ గా వస్తుంది అని ఊదరగొట్టడం తప్ప ప్రజల్లో తమకెలాంటి స్థానం ఉందొ, ఎంత బలం ఉందొ అనేది అంచనా వెయ్యలేదు. కేవలం ఓటు బ్యాంక్ ని నమ్మి ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా ఓడిపోవడానికి కారణం జగనే అంటూ బ్లూ మీడియా జగన్ అహంకారం గురించి వివరిస్తూ రాస్తున్న కథనాలకు వైసీపీ నేతలకే దిమ్మతిరిగి ఉంటుంది.