Health Care

రోజువారీ ఆనందాలు.. ఆస్వాదించే మార్గాలు.. ఎలా స్వీకరిస్తామన్నదే ముఖ్యం!


దిశ, ఫీచర్స్ : ‘‘నీ గురించి నీవు ఎక్కువగా ఎలా ఊహించుకుంటావో దాదాపు అలాగే మారుతుంటావు. సమర్థుడిగా ఊహించుకుంటే సామర్థ్యం పెరుగుతుంది. బలహీనుడిగా ఊహించుకుంటే బలహీనతే ఆవహిస్తుంది’’ అన్నాడో ఫిలాసఫర్. అన్ని సందర్భాల్లో కాకపోయినా.. ఆయా సందర్భాల్లో ప్రజల జీవితానికి ఇది చక్కగా వర్తిస్తుంది. కొందరు ప్రతీ క్షణం, ప్రతీ రోజు సరదా.. సరదాగా ఉంటారు. ఎక్కడా లేని ఆనందాన్ని తామే ఆస్వాదిస్తున్నట్లు ఫీలవుతుంటారు. మరి కొందరు బాధను పనిగట్టుకొని స్వాగతిస్తున్నట్లు కనిపిస్తుంటారు. లైఫ్‌లో ఇవన్నీ సాధారణమే అయినప్పటికీ, ఎక్కువశాతం ఆనందంగా ఉండటమే జీవిత పరమార్థంగా నిపుణులు, పెద్దలు చెప్తుంటారు.

 మల్చుకుంటూ పోవడమే..

ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పొద్దు పోయేవరకు మన జీవితాన్ని ఎలా ఆస్వాదిస్తామనేది మన చేతుల్లోనే ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెప్తుంటారు. అందుకోసం ఎదుర్కొనే ప్రతి అనుభవాన్నీ దాదాపు ఆనందంగా మల్చుకునే ప్రయత్నమే చేయాలని, అలాంటి డైలీ రొటీన్స్‌ను అలవర్చుకోవాలనిసూచిస్తున్నారు. ఆలోచించే తీరును బట్టి, ఆస్వాదించే హృదయాలను బట్టి కూడా కూడా మన రోజువారీ ఆనందాలు ముడిపడి ఉంటాయని చెప్తున్నారు. అయితే కొన్నింటిని మనం డైలీ అనుభవిస్తుంటాం కానీ.. గుర్తించలేకపోతుంటాం. అలాంటి ఆనందకరమైన రోజువారి అలవాట్లు, సందర్భాలు ఏమిటో చూద్దాం.

ఉదయాన్నే కాఫీ తాగుతూ..

ఆస్వాదించే ఉద్దేశం ఉండాలే గానీ ఉదయం లేవగానే మనకళ్లముందు కనిపించే హ్యాపీ‌ మూమెంట్స్ ఎన్నో ఉంటాయి. అలాంటి వాటిలో కాఫీ లేదా టీ కూడా ఒకటి. అత్యధిక మందికి ఆనందాన్ని కలిగించే మార్నింగ్ హాబిట్స్‌లో ఈ రెండు పానీయాల్లో ఏదో ఒకటి తప్పకుండా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే డైలీ మార్నింగ్ సమయంలో కాఫీ లేదా టీ స్మెల్ పీల్చకపోతే కొందరికి ఏం తోచదు. ఆ వేడి వేడి పొగలు చిమ్మే పానీయపు వాసన మాత్రమే పలువురికి మైండ్ రిలాక్స్ అయ్యేలా చేస్తుంది. ఆ రోజు మొత్తం యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంది. ఇలా కాఫీ లేదా టీని సిప్ చేయడంకంటే మెరుగైన డైలీ రొటీన్స్ ఇంకేమీ ఉండవేమోనని కూడా కొందరు భావిస్తుంటారు.

వారాంతం.. సంగీతం..

ప్రపంచ వ్యాప్తంగా చాలామందిలో ఆనందాన్ని కలిగించే మరో ముఖ్యమైన సందర్భం వారాంతం లేదా వీకెండ్ డే. ఇక రేపు వర్క్ ఉండదు. హాలిడే వస్తోంది అంటూ ముందురోజు నుంచే తెగ ఆనంద పడుతుంటారు కొందరు. మరికొందరిలో సంతోషం కట్టలు తెంచుకునే అరుదైన సందర్భం ఏంటంటే.. ఇష్టమైన మ్యూజిక్ లేదా పాటలు వినడం. ఇంట్లో ఉన్నప్పుడో, దారిలో వెళ్తూ వెళ్తూనో మ్యూజిక్ ఆస్వాదించడం కూడా క్రేజీగా ఉంటుంది పలువురికి. ఇష్టమైన పాట వస్తున్నప్పుడు పెదవులపై చిరునవ్వు, ముఖంలో ఆనందం సహజంగానే అలముకుంటాయి. కనుబొమ్మలు వాటికవే కదులుతుంటాయి. ఏదో తెలియని ఆనందంలో మునిగిపోతుంటాం. డైలీ రొటీన్‌లో ఇదో గొప్ప అనుభవంగా ఉంటుంది.

సంభాషణలు.. సరదా మాటలు

మనం ప్రతిరోజూ ఎవరో ఒకరితో ఏదో ఒక విషయంలో సంభాషణ కొనసాగిస్తుంటాం. తరచి చూడాలే కానీ ఇందులో ఆస్వాదించడానికి బోలెడు ఆనందం ఉంటుంది. స్నేహితులతో, కొలీగ్స్‌తో, బంధువులతో, సరదా మాటలు, వరుసైన వారితో సరసాలు ఇరువైపులా ఆనందాన్ని కలిగించే ఆనందాన్నిచ్చే రోజువారీ సన్నివేశాలే. అంతేకాదు ఇష్టమైన వ్యక్తి నుంచి మెసేజ్ రిసీవ్ చేసుకున్నప్పుడు, వారు కళ్లముందు కనిపిస్తున్నప్పుడు కూడా ఆనందం రెట్టింపు అవుతుంది. వీటితోపాటు విహార యాత్రలు, ఆటలు, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడం, ప్రశంసలు అందుకోవడం, జీవితంలో సెటిల్ అవ్వడం ఆనందాన్ని కలిగించే అద్భుతమైన అంశాలుగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు.

చినుకుల సవ్వడి.. ఆకాశంలో హరివిల్లు

వర్షం పడుతున్న సందర్భం కూడా రోజువారీ ఆనందంలో భాగమే. చినుకల సవ్వడి ఓ విధమైన అనుభూతిని కలిస్తుంది. ఆకాశంలో కదిలే మబ్బులు, మెరిసే హరివిల్లు కూడా అత్యంత సంతోషాన్నిచ్చే సందర్భాలు. జర్నీలో ఉన్నప్పుడు పరిసరాలను గమనించడం, ట్రాఫిక్ లేనప్పుడు కారు లేదా బైకుపై దూసుకుపోవడం కూడా కొందరికి ఆనందాన్ని ఇస్తాయి. మసాజ్ చేయించుకోవడం కొందరికి, ఇంటికి రాగానే సమ్మర్ అయితే చల్లని నీటితో, మిగతా సీజన్లు అయితే గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం ఇంకొందరికి ఆనందాన్నిస్తుంది. అలాగే స్విమ్మింగ్ చేయడం కొందరికి, అప్పులు లేకపోవడం ఇంకొందరికి, ఊహించని బహుమతి అందుకోవడం లేదా మనసుకు నచ్చిన పనులు చేయడం ఇంకొందరికి అనిర్వచనీయ ఆనందాలుగా భాసిల్లుతుంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిరోజూ మనం అనుభవించగలిగే ఆనంద సన్నివేశాలు, సందర్భాలు చాలా ఉంటాయి. ఎలా స్వీకరిస్తారన్నదే ముఖ్యం. 



Source link

Related posts

ఈ రెడ్ జ్యూస్ తో శరీరానికి నేచురల్ డిటాక్స్.. ఎలా తయారు చేయాలంటే..

Oknews

హైపర్‌పిగ్మెంటేషన్‌తో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే చాలు చర్మం తెల్లగా మారుతుంది..

Oknews

మాఘ పూర్ణిమ రోజు ఇలా చేస్తే.. మీ కోరికలు నెరవేరతాయి..

Oknews

Leave a Comment