Nara lokesh: సచివాలయంలోని 4వ బ్లాక్‌లో మంత్రిగా నారాలోకేష్ బాధ్యతలు చేపట్టారు. సెక్రటేరియట్ 4వ బ్లాక్ రూమ్ నంబర్ – 208లోని ఛాంబర్ లో మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజి శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టడానికి ముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన ఛాంబర్‌లో కూర్చునే ముందు సీటుపై ఉంచిన టవళ్లను లోకేష్ స్వయంగా తొలగించారు.