St Lucia weather update: ఇది మనం ప్రతీకారం తీర్చుకొనే సమయం. కానీ ఆస్ట్రేలియాకి పరువు సమస్య. ఎందుకంటే ఈ మ్యాచ్ లో గెలిస్తేనే ఆస్ట్రేలియా సెమీస్ చేరుతుంది. కానీ ప్రకృతి అందుకు సహకరించేలా లేదు. రాత్రంతా సెయింట్ లూసియాలో వర్షం పడుతూనే ఉంది. దీంతో అందరి చూపు సెయింట్ లూసియా వాతావరణం మీదే ఉంది .. గూగుల్ లో ప్రతి ఒక్కరూ సెయింట్ లూసియా వెదర్ ఎలా ఉందో చెక్ చేస్తున్నారట. అక్కడ ఇండియన్స్ అయితే తమ బాధ్యతగా ట్విటర్ లో వాతావరణం అప్డేట్ ఇస్తున్నారు.
The last weather update for the night at 11 pm St Lucia time. It has been raining here for the past 10-15 minutes. Steadiest showers we’ve had all day. #IndvsAus #t20worldcup
— Ayan (@ayan_acharya13) June 24, 2024
అసలు ఈ రోజు కూడా పడితే మ్యాచ్ జరిగే అవకాశం లేకపోతే పరిస్థితి ఏంటో ఇప్పుడు చూద్దాం. T20 ప్రపంచ కప్ 2024లో సూపర్ 8 పోరులో భారత్ మరియు ఆస్ట్రేలియా తలపడనున్న సెయింట్ లూసియాలో వర్షం పడకుండా మ్యాచ్ జరిగితే టీమిండియా, ఆస్ట్రేలియా ల్లో ఎవరు గెలిస్తే వాళ్లు సెమీస్ లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటారు. ఇండియా జట్టు గెలిస్తే మూడు మ్యాచులు గెలిచాం కాబట్టి దర్జాగా సెమీస్ కి వెళ్లిపోతాం. ఆస్ట్రేలియా గెలిస్తే మాత్రం మనం ఆఫ్గాన్, బంగ్లా మధ్య జరిగే మ్యాచ్ పై దృష్టి పెట్టాలి. అయినా సరే ఇప్పటికే నాలుగు పాయింట్లు ఉన్న భారత జట్టుకు సెమీస్ వెళ్లే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. కానీ ఆఫ్గాన్ గెలిస్తే మాత్రం ఇండియా, ఆస్ట్రేలియా, ఆఫ్గాన్ మూడు జట్లకు నాలుగేసి పాయింట్లే ఉంటాయి కాబట్టి నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉన్న మొదటి రెండు జట్లు సెమీస్ కి వెళ్తాయి. మూడో టీమ్ తట్టా బుట్టా సర్దుకొని ఇంటికి వెళ్లిపోతుంది. ప్రస్తుటానికి ఆస్ట్రేలియా, ఆఫ్గాన్ లతో పోలిస్తే భారత జట్టుకు నెట్ రన్ రేట్ ఎక్కువగానే ఉంది. సో టీమిండియా గెలిస్తే గోలే ఉండదు. ఖర్మ కాలి ఓడినా భారీ ఓటమి ఉండకుండా ఉంటే అదే పదివేలు. ఏదేమైనా టీం ఇండియా సెయింట్ లూసియాకి చేరుకుంది. ఆ వీడియో ఒకసారి చూడండి .. చూసిన వెంటనే వచ్చే ఫీలింగ్ ఏంటి.. ఆడాలి బాస్ .. గెలవాలి బాస్ అనే అనిపిస్తుంది..
#TeamIndia have arrived in St. Lucia! 🛬
Today they take on Australia in the their last Super 8 match 💪#T20WorldCup | #INDvAUS pic.twitter.com/mhwABUIEkD
— BCCI (@BCCI) June 24, 2024
వర్షం పడితే ..
ఒకవేళ గత కొన్ని గంటలుగా పడుతున్న వర్షం అలాగే కొనసాగితే మ్యాచ్ రద్దవుతుంది. దీంతో రూల్ ప్రకారం ఇండియాకు, ఆస్ట్రేలియాకు చెరో పాయింట్ వస్తాయి. అప్పుడు ఆఫ్గాన్, బంగ్లా మ్యాచ్ తో సంబంధం లేకుండా ఇండియా చక్కగా సెమీస్ కి వెళ్లిపోతుంది. కానీ ఆస్ట్రేలియాకి మాత్రం 3 పాయింట్లే ఉంటాయి కాబట్టి ఆఫ్గాన్, బంగ్లా మ్యాచ్ కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. ఒకవేళ ఆఫ్గాన్ గెలిస్తే..ఆస్ట్రేలియా పెట్టె బేడ సర్దుకొని ఇంటికి పోవాలి. ఆఫ్గాన్ ఓడిపోతే ఒక్క పాయింట్ ఎక్కువున్నఉన్న ఆస్ట్రేలియా సెమీస్ కి చేరుతుంది.
అయినా మనకి ఇదంతా ఎందుకు.. మ్యాచ్ జరగాలి, ఇండియా గెలవాలి, ఆస్ట్రేలియా ఓడాలి. తట్టా బుట్టా సర్దుకొని ఇంటికి తిరిగిపోవాలి.. అప్పుడే కదా కిక్కు.. ఆమాత్రం కిక్కు ఉండాలబ్బా మనకి..
మరిన్ని చూడండి