EntertainmentLatest News

చనిపోదామనుకున్న ముసలావిడ పాప ప్రాణాలని కాపడగలిగిందా!


 

కొన్ని హాలివుడ్ సినిమాల్లో కంటెంట్ భిన్నంగా ఉంటుంది. కాస్త స్లో టేకింగ్ ఉన్న సినిమాలు కూడా మంచి ఫీల్ ఇస్తాయి.  అలాంటిదే ‘లూ’ అనే హాలివుడ్ మూవీ. థ్రిల్లర్ సినిమాలని ఇష్టపడేవారి లిస్ట్ లో ఈ మూవీ ఒకటిగా నిలుస్తుంది. 

ఈ మూవీ కథేంటో ఓసారి చూసేద్దాం.. లూ అనే ముసలావిడ ఒంటరిగా ఓ ఇంట్లో నివసిస్తుంది. తను ఇంటి చుట్టుప్రక్కల ఎవరితోని అంతగా మాట్లాడదు. అలాంటిది ఒకరోజు తన అకౌంట్ లో నుండి భారీ మొత్తంలో డబ్బు తీసుకొచ్చి, తన పెంపుడు కుక్కకి కావాల్సిన ఫుడ్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెడుతుంది. ఇక తనకి సంబంధించిన ఫోటోలు, డాక్యుమెంట్లు అన్నీ తీసుకొచ్చి కాల్చేస్తుంది. ఇక తను చనిపోదామనుకొని ఓ పెద్ద గన్నుతో కాల్చుకుందామని ట్రిగ్గర్ నొక్కబోతుండగా సడన్ గా హన్నా అనే ఒకామె వచ్చి.. తన పాప ‘ వీ ‘ కనపడకుండా పోయిందని ఏడుస్తూ చెప్తుంది. తనని ఎలాగైనా కాపాడాలని హాన్నా ఆ ముసాలావిడ ‘లూ’ ని కోరగా.. తన కూతురు ‘వీ’ ని క్షేమంగా తీసుకొస్తానని చెప్పి అక్కడి నుండి బయల్దేరి వెళ్తుంది. చిన్నారిని కిడ్నాప్ చేసిందెవరు? ముసలావిడ లూ అసలెందుకు చనిపోవాలనుకుంది? మరి లూ చిన్నారిని కాపాడిందా లేదా అనేది మిగతా కథ.

దర్శకుడు అన్నా ఫారెస్టర్ ఎంచుకున్న కథ కాస్త భిన్నంగా ఉంది. అన్ని కథల్లా కాకుండా చావుకి సిద్ధపడిన మహిళ నుండి చావు బతుకుల్లో ఉన్న పాపని కాపడేలా చేశాడు. అలా కథని ఎత్తుకున్న తీరు బాగుంది. లూ అనే ఒంటరి ముసాలావిడ విచిత్రంగా ఉందని అందరు అనుకుంటారు. కానీ చిన్నారి కోసం ప్రాణాలకు తెగించి పోరాడటం, తన ప్రయత్నం చూస్తుంటే చూసే ప్రేక్షకడికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది.  ఎడిటింగ్  బాగుంది. స్క్రీన్ ప్లే కాస్త స్లోగా ఉన్న కథనం బాగుంటుంది. ద్వితీయార్థంలో వచ్చే ట్విస్ట్ ఎవరూ ఊహించరు. అయితే కొన్ని సీన్లు అనవసరమనిపిస్తాయి. అయితే ‘లూ’ గట్స్ చూస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ. ‘లూ’ గా అలిసన్ జానీ నటన సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. ‘హన్నా’గా జుర్నీ స్మోలెట్, ‘వీ’ గా రైడ్లీ ఆషా నటన ఆకట్టుకుంటుంది. థ్రిల్లర్ సినిమాలని ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చేస్తుంది. అయితే భారీ అంచనాలు పెట్టుకోకుండా చూస్తే సినిమా బాగుంటుంది. నెట్ ఫ్లిక్స్ లో తెలుగులో అందుబాటులో ఉన్న ఈ సినిమాని ఓసారి ట్రై చేయండి.

 



Source link

Related posts

Common audience doubt on Kalki కల్కి పై కామన్ ఆడియన్స్ డౌట్

Oknews

‘దేవర’పై ఎన్టీఆర్ కాన్ఫిడెన్స్.. అభిమానులు కాలరెగరేసుకునే సినిమా ఇది!

Oknews

ఎలక్షన్ మూవీ రివ్యూ

Oknews

Leave a Comment