డిమాండ్‌ను బట్టీ ఒకటి, రెండు, మూడు సర్వీసులను తీసుకొస్తుంది. అలాగే ఏసీ, సూపర్ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ సర్వీస్‌లను నడుపుతోంది. ఇప్పటికే తమిళనాడులోని అరుణాచలం పుణ్యక్షేత్రానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఏసీ, సూపర్ లగ్జరీ బస్ సర్వీస్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఏకంగా గోవా పర్యటకానికి సూపర్ లగ్జరీ సర్వీసులను ఏపీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది.