కొత్త పాలసీ ప్రకటించక ముందే మద్యం ధరల్ని రెండు రెట్లు పెంచేశారు. జనం గగ్గోలు పెట్టినా ఖాతరు చేయలేదు. కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, యానం, తెలంగాణ రాష్ట్రాలతో సరిహద్దులు ఉన్నఏపీలో ఇతర రాష్ట్రాల మద్యం రానివ్వకుండా అడ్డుకోడానికి సెబ్ అనే కొత్త వ్యవస్థను ఏర్పాటు చేశారు. తలతోక లేని తలతిక్క నిర్ణయాలతో తొలి ఏడాదే జనం నుంచి తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నారు.