GossipsLatest News

Divorce with Aish: Abhishek Bachchan Fire ఐష్ తో విడాకులు: అభిషేక్ ఫైర్



Tue 25th Jun 2024 11:39 AM

abhishek bachchan  ఐష్ తో విడాకులు: అభిషేక్ ఫైర్


Divorce with Aish: Abhishek Bachchan Fire ఐష్ తో విడాకులు: అభిషేక్ ఫైర్

అభిషేక్ బచ్చన్ తో మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ విడిపోతుంది, అభిషేక్-ఐష్ లు విడాకులు తీసుకోబోతున్నారు, అందుకే ఐష్ తన కుమార్తె ఆరాధ్య తో కలిసి తన తల్లి దగ్గరే ఉంటుంది అంటూ ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్న వార్తే. అభిషేక్ బచ్చన్ ఫ్యామిలీ విషయంలో ఐశ్వర్య అసంతృప్తిగా ఉంది.. అందుకే అభిషేక్ కి ఐష్ విడాకులు ఇచ్చేస్తుంది అంటూ బాలీవుడ్ మీడియా లో కథనాలు ప్రచురితమవుతూనే ఉన్నాయి. 

ఐశ్వర్య రాయ్ ఎప్పటికప్పుడు ఈ విడాకుల రూమర్స్ కి నోటితో కాకుండా ఏదో ఒక పోస్ట్ తో సమాధానమిస్తూనే ఉంది. పెళ్లి రోజున అభిషేక్ తో కలిసి ఉన్న పిక్ ని షేర్ చెయ్యడమో.. లేదంటే కూతురు, భర్త తో కలిసి ఉన్న పిక్స్ షేర్ చేస్తూ ఈ విడాకుల రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెడుతున్నా.. ఈ వార్తలకి అడ్డుకట్ట పడడమే లేదు. తాజాగా అభిషేక్ బచ్చన్ ఈ విడాకుల రూమర్స్ పై ఫైర్ అయ్యాడు. 

అభిషేక్ మాట్లాడుతూ.. అవును మా విడాకులు నిజమే.. ఈ విషయం మాకు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. విడాకుల తర్వాత మేము చేసుకోబోయే పెళ్లి గురించి కూడా మీరే చెప్పండంటూ అభిషేక్ బచ్చన్ ఫైరయ్యాడు. నా భార్య  ఐశ్వర్యకు నాకు జీవితంలో లైఫ్ లో ఎలా ఉండాలి, ఎలా ముందుకు వెళ్లాలి.. అనేది పూర్తిగా తెలుసు. అది మీరు లేదా మూడో వ్యక్తి వచ్చి చెబితే తెలుసుకోవాల్సిన అవసరం లేదన్నాడు. 

ఐశ్వర్య పై నాకు ఎంత ప్రేమ ఉందో ఆమెకు తెలుసు.. ఐష్ కు నాపై ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు.. మా ప్రేమ గురించి ప్రతిసారి మీకు తెలియజేయాల్సిన అవసరం లేదు. మీడియా వాళ్ళు చెప్పే దాని మీదనే నా జీవితం నడవాలి అంటే నడవదు.. నా పర్సనల్ లైఫ్ నాకు ఉంటుంది. మీడియాలో వచ్చిన రూమర్స్ ‌ని నేను పట్టించుకోను. అందుకే విడాకుల రూమర్స్ పై ప్రతిసారి స్పందించలేనంటూ.. కాస్త ఘాటుగానే అభిషేక్ ఈ విడాకుల పుకార్లపై స్పందించాడు.  


Divorce with Aish: Abhishek Bachchan Fire:

When Abhishek Bachchan sarcastically rubbished divorce roumours









Source link

Related posts

Gaami 4 days collections విశ్వక్ సేన్ గామి 4 డేస్ కలెక్షన్స్

Oknews

Harish Rao Comments At Medak Assembly Constituency BRS Workers | Harish Rao: బీఆర్ఎస్ అలా చేసింటే, సగం మంది కాంగ్రెస్ వాళ్లు జైళ్లలోనే

Oknews

Director of Medical Education Telangana has released notification for the recruitment of various posts in 26 medical colleges around the state

Oknews

Leave a Comment