Health Care

AP:ఆ జిల్లాలో బయటపడిన ప్రపంచంలోనే అత్యంత పురాతన ఆస్ట్రిచ్ గూడు!?


దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుతం ప్రపంచంలో అతి పెద్ద జంతువులుగా చెప్పుకుంటున్న వాటిలో చాలా జంతువులు ఇండియాలోను మనుగడ సాగించాయి. పరిశోధకులు ఏం చెబుతున్నారంటే డైనోసార్స్ కూడా ఇండియాలో ఉండేవి అంట. ఇలా ప్రజెంట్ అంతరించి పోయిన జంతువులు కూడా భారత్‌లో మనుగడ సాగించాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత పురాతన ఆస్ట్రీచ్(నిప్పుకోడి) గూడు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో బయటపడింది. పలు దేశాలకు చెందిన పరిశోధకులతో కలిసి గుజరాత్‌లోని వడోదర యూనిర్శిటీ నిపుణులు చేపట్టిన తవ్వకాల్లో ఇది వెలుగుచూసింది. అందులో 911 గుడ్లకు సంబంధించిన అవశేషాలు ఉన్నాయని వారు తెలిపారు.

భారత్ ఒకప్పుడు వైవిధ్యమైన ఎన్నో జీవజాతులకు ఆలవాలంగా ఉండేదని చెప్పేందుకు ఈ గూడు ఓ నిదర్శనమని వివరించారు. అయితే మెగాఫౌనా జంతువులు ఇవి 40 కిలోల కంటే ఎక్కువ బరువుంటాయి. ఇవి భారత్‌లో ఎందుకు అంతరించిపోయాయి అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం పరిశోధకులు శోధన కొనసాగిస్తున్నారు. ఈ పరిశోధనకు ఇప్పుడు దొరికిన ఆస్ట్రిచ్ గూడు చాలా ఉపయోగపడుతుందని వారు చెబుతున్నారు. సాధారణంగా ఆస్ట్రిచ్ గూడు 9 నుంచి 10 అడుగుల వెడల్పుగా ఉంటుంది. కానీ.. ప్రకాశం జిల్లాలో దొరికిన నిప్పుకోడి గూడు 1X1.5 మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ గూడులో 3,500 ఈ పక్షి గుడ్డు పెంకులు దొరికినట్లు సమాచారం.



Source link

Related posts

అప్పులు పెరిగిపోతున్నాయా.. అయితే ఇలా చేయండి..!

Oknews

ప్రేమికుల రోజు.. ఆ రాశుల వారికి కలిసివస్తుందట.. మీ రాశి ఉందా?

Oknews

కొలెస్ట్రాల్ పెరిగిందా.. అయితే ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండండి

Oknews

Leave a Comment