Sports

Rohit Sharma 92 vs Aus | Rohit Sharma 92 vs Aus | T20 World Cup 2024 లో ఫాసెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టిన హిట్ మ్యాన్


 రోహిత్ శర్మ గురించి ఎప్పటి నుంచో అందరూ చెప్పే విషయం ఒకటి ఉంది. రోహిత్ శర్మను అవుట్ చేస్తే అతని క్రీజ్ లోకి వచ్చిన 2-3 ఓవర్లలోపు అవుట్ చేసేయాలి.   ఒకవేళ ఎక్కువసేపు క్రీజ్ లో ఉన్నాడా ఇక అంతే..షర్ట్ తడిసిందంటే చాలు ప్రత్యర్థలకు చెమటలు పట్టిస్తాడు. సొగసైన షాట్లతో బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. నిన్న కూడా అదే జరిగింది ఆస్ట్రేలియా తో టీ20 వరల్డ్ కప్ లో సూపర్ 8 మ్యాచ్ అంటే ఓ రకమైన టెన్షన్ ఉంటుంది. అందుకేగా కొహ్లీ కూడా డకౌట్ అయ్యాడు. కానీ రోహిత్ శర్మ ఆ టెన్షన్ కే నిన్న టెర్రర్ పుట్టించాడు. బాగా ఆడటం…92కొట్టడం గొప్ప కాదు. కానీ కొట్టిన విధానం గొప్పది. క్రికెట్ పరిభాషలో ఈ మూలకు కొడితే ఈ షాట్ అంటూ ఒక్కో దానికి ఒక్కో పేరు ఉంటుంది ఆశ్చర్యకరంగా నిన్న దాదాపు అలా ఫీల్డ్ మ్యాప్ మొత్తం షాట్లు ఆడాడు రోహిత్ శర్మ. ఈ ఫోటో ఒక్కటి చాలదా హిట్ మ్యాన్ కమ్ బ్యాక్ ఏ రేంజ్ లో ఉందో చెప్పటానికి. ఈ వరల్డ్ కప్ లో మొదటి మ్యాచ్ ఐర్లాండ్ మీద  హాఫ్ సెంచరీ కొట్టిన రోహిత్ మళ్లీ ఆస్థాయిలో ఆడలేకపోయాడు. అలాంటిది నిన్న మాత్రం చెలరేగిపోయాడు. 41బాల్స్ ఆడి 7ఫోర్లు 8 భారీ సిక్సర్లతో 92పరుగులు చేశాడు. 19 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టి ఈ వరల్డ్ కప్ లో నే ఫాసెస్ట్ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. రోహిత్ 12ఓవర్లో అవుటయ్యేప్పటికీ భారత్ స్కోరు 127పరుగులు అందులో 92పరుగులు రోహిత్ వే అంటే అర్థం చేసుకోవచ్చు. హిట్ మ్యాన్ డామినేషన్ ఏ రేంజ్ లో సాగిందో. తన అద్భుతమైన ఆటతో ట్రేడ్ మార్క్ పుల్ షాట్లతో రోహిత్ కొట్టిన స్కోరు కారణంగానే భారత్ 205పరుగుల భారీ స్కోరు చేయగలిగి ఆస్ట్రేలియాను 24పరుగుల తేడాతో ఓడించేందుకు దోహదపడింది. అందుకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా రోహిత్ శర్మనే వరించింది.

క్రికెట్ వీడియోలు

Gulbadin Naib Slow Down Afg vs Ban Match | ఒక్క గెలుపు కోసం ఎన్ని కష్టాలొచ్చాయి సర్ కాబూలీలకు | ABP

Gulbadin Naib Slow Down Afg vs Ban Match | ఒక్క గెలుపు కోసం ఎన్ని కష్టాలొచ్చాయి సర్ కాబూలీలకు | ABP

మరిన్ని చూడండి



Source link

Related posts

Afghanistan women request ICC to help set up a refugee team in Australia

Oknews

Anushka Sharma Virat Kohli Blessed With Baby Boy Couple Names Him Akaay What Is The Meaning Of Akaay | Akaay Kohli: విరూష్కల రెండో బిడ్డ అకాయ్

Oknews

SRH vs MI IPL 2024 Sunrisers Hyderabad post the highest total ever in the history of IPL

Oknews

Leave a Comment