ఒక నమ్మకం..మనిషిని ఎంత పనైనా చేయిస్తుంది. మనల్ని నమ్మే వాళ్లున్నప్పుడు ఆ విషయం విలువ మనకు అర్థం అవుతుంది. అదింకా బాగా అర్థం కావాలంటే రషీద్ ఖాన్ ను అడిగితే చెబుతాడేమో. నిన్న బంగ్లా దేశ్ పై మ్యాచ్ గెలిచి టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో తొలిసారి అడుగుపెట్టగానే దాని గురించే మాట్లాడాడు రషీద్ ఖాన్. ఈ విజయం వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రయాన్ లారా కి మేమిచ్చే బహుమతి అన్నాడు రషీద్ ఖాన్. ఎందుకంటే ఏదైనా వరల్డ్ కప్ మొదలయ్యే ముందు చాలా విశ్లేషణలు వస్తుంటాయి. ఎలాంటి టీమ్ ఉండాలి దగ్గర నుంచి ఎవరెవరు సెమీస్ కి వెళ్తారు అనేంత వరకూ చాలా మంది చాలా చెబుతుంటారు. కానీ బ్రయాన్ లారా మొత్తం ఈ టీ20 వరల్డ్ కప్ కి సెమీస్ కి వచ్చే నాలుగు జట్లు ఏవి అనుకుంటున్నారంటే ఇండియా, వెస్టిండీస్, ఇంగ్లాండ్, ఆఫ్గానిస్థాన్. మొదటి మూడు పేర్లు ఓకే వాళ్లు ఆల్రెడీ విశ్వవిజేతలుగా నిలిచారు కాబట్టి చెప్పారు అనుకోవచ్చు. కానీ ఆ నాలుగో పేరు ఆఫ్గానిస్థాన్ ఎందుకు చెప్పారు. ఆస్ట్రేలియా లాంటి టీమ్ ను వదిలేసి ఆఫ్గాన్ సెమీస్ లో ఉంటుందని ఎలా గెస్ చేశారు లారా. ఇదే ఆఫ్గాన్ ఆటగాళ్లలోనూ అంతులేని ఆత్మవిశ్వాసాన్ని పెంచింది అంట.
క్రికెట్ వీడియోలు
Afghanistan T20 World Cup 2024 Semis | Home Ground కూడా లేని ఆఫ్గాన్ కు BCCI అండ | ABP Desam
మరిన్ని చూడండి