EntertainmentLatest News

‘కల్కి 2898 AD’లో ఉన్న సర్‌ప్రైజ్ లన్నీ రివీల్! 


‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) సినిమాతో అసలుసిసలైన పండుగ వాతావరణం నెలకొంది. సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ఇక విడుదలకు కొద్ది గంటల ముందు సినిమాకి సంబంధించిన పలు సర్ ప్రైజ్ లను మూవీ టీం రివీల్ చేసింది.

హీరో ప్రభాస్ (Prabhas), డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లైవ్ లో ‘కల్కి’ గురించి పలు విషయాలను పంచుకున్నారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ సహా పలువురు హీరోలు ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారని ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ.. కల్కిలో విజయ్, దుల్కర్ నటించిన విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ సినిమాకి పార్ట్-2 ఉంటుందని కూడా ఎప్పటినుంచో ప్రచారం ఉంది. ఆ విషయాన్ని కూడా రివీల్ చేశారు. ఒక పది రోజులు రెస్ట్ తీసుకొని, ఆ తరువాత పార్ట్-2 వర్క్ స్టార్ట్ చేస్తామని తెలిపారు.

ఇక “కల్కి క్లైమాక్స్ ప్రభాస్‌ కి కూడా సర్ ప్రైజ్ అని, క్లైమాక్స్‌లోని పాట అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అవుతుంది” అంటూ నాగ్ అశ్విన్ చేసిన కామెంట్స్ సినిమాపై హైప్ మరింత పెంచాయి. 



Source link

Related posts

జోజు జార్జ్, ఐశ్వర్య రాజేష్ ‘పులిమేద’ ట్రైలర్ విడుదల

Oknews

ఓటీటీలోకి రానున్న హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

Oknews

‘కల్కి’ బడ్జెట్‌ రూ.600 కోట్లు.. ఆ డైరెక్టర్‌ రెమ్యునరేషన్‌ రూ. 600 కోట్లు!

Oknews

Leave a Comment