ByGanesh
Thu 27th Jun 2024 09:45 AM
కోలీవుడ్ టాప్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ లియో తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ తో కూలి మూవీ చెయ్యబోతున్నాడు. ఇప్పటికే సూపర్ స్టార్-లోకేష్ ల మూవీ పై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. జైలర్ హిట్ తర్వాత రజినీకాంత్ మరో మూవీ చేస్తున్నారు. లాల్ సలాం తో నిరాశపరిచిన సూపర్ స్టార్ ఇప్పుడు వెట్టయ్యన్ మూవీ షూటింగ్ లో ఉన్నారు.
అది పూర్తి కాగానే సూపర్ స్టార్ రజినీకాంత్ లోకేష్ కనగరాజ్ మూవీ సెట్స్ లోకి వెళ్ళిపోతారు. రజినీకాంత్-లోకేష్ కనగరాజ్ కలయికలో రాబోయే మూవీ టైటిల్ కూలి. అయితే కూలి లో రజినీకాంత్ లుక్ ఎలా ఉండాలో అనేది లోకేష్ ప్లాన్ చేసుకుంటున్నాడు. అందుకు సంబంధించి లుక్ టెస్ట్ అంటూ సూపర్ స్టార్ మేకప్ తో రెడీ అవుతున్న పిక్ ని షేర్ చేసాడు.
అసలు కూలి మూవీ ఉంటుందా అనే వారికీ ఇలాంటి ఫొటోతో లోకేష్ క్లారిటీ ఇచ్చేసాడు. సూపర్ స్టార్ కూలి లుక్ టెస్ట్.. జులై నుంచి కూలి సెట్స్ మీదకి వెళ్ళబోతున్నట్టుగా లోకేష్ కనగరాజ్ బిగ్ అప్ డేట్ కూడా ఇచ్చేసాడు. సో రజినీకాంత్ ని కూలి మూవీ లో లోకేష్ ఎలా చూపిస్తాడో.. కమల్ కి విక్రమ్ తో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు, ఇప్పుడు రజినీకాంత్ కి కూడా కూలి తో బ్లాక్ బస్టర్ ఇవ్వాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో అనేది..!
Lokesh Kanagaraj Provides Sneak Peek About Rajinikanth Coolie:
Lokesh Kanagaraj Checks Rumours About Coolie