India vs England Semi Final 2 Preview : సమ ఉజ్జీలు. ఎంతెలా అంటే రికార్డులు చూసుకున్నా సరే టీ20 ఫార్మాట్ లో ఇండియా, ఇంగ్లండ్ రెండూ రెండే ఎక్కడా తగ్గవు. టీ20 వరల్డ్ కప్పులో ఈ రెండూ ఇప్పటివరకూ 4 మ్యాచులు ఆడితే 2వాళ్లు గెలిచారు 2 మనం గెలిచాం. మొత్తం వీళ్లిద్దరూ ఆడిన టీ20 లు చూసుకున్నా 12 మనం గెలిచాం..11 మ్యాచులు వాళ్లు గెలిచారు. అంత టగ్ ఆఫ్ వార్ లా జరుగుతాయి ఈ రెండు దేశాలు మధ్య టీ20 మ్యాచులు. మరి అలాంటి రెండు దేశాలు ఈ రోజు టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో తలపడుతున్నాయి. మరి ఈ మ్యాచ్ లు ఏ టీమ్ బలాబలాలు ఎలా ఉన్నాయో ఈ మ్యాచ్ ప్రివ్యూ లో చూసేద్దామా.
ముందుగా టీమిండియా విషయానికి వస్తే మనం బలం మన బలగం ఈ వరల్డ్ కప్ లో అయితే బౌలింగ్ లానే సాగుతోంది. బ్యాటింగ్ లో మనోళ్లు అనుకున్నంత స్థాయిలో ఇప్పటివరకూ మెరవలేదు. అఫ్ కోర్స్ పిచ్ లు కూడా అలానే ఉన్నాయి. కానీ ఇఫ్పటి నుంచి వేరే లెక్క. ఇవాళ ఇంగ్లండ్ తో జరిగే మ్యాచ్ లో పిచ్ తో సంబంధం లేకుండా బ్యాటర్లు చెలరేగి ఆడితేనే ఇంగ్లీష్ ఆటగాళ్లను కంట్రోల్ చేయగలుగుతాం. పెద్ద సానుకూల అంశం ఏంటంటే కెప్టెన్, ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అద్భుతమైన టచ్ లోకి రావటమే. ఆస్ట్రేలియా తో జరిగిన సూపర్ 8 మ్యాచ్ లో రఫ్పాడించి వాళ్లని ఇంటికి పంపేలా చేసింది హిట్ మ్యాన్ ఫియర్ లెస్ బ్యాటింగే. దానికి విరాట్ కొహ్లీ కూడా తోడైతే రవి అస్తమించని సామ్రాజ్యానికి చుక్కలు కనిపించటం ఖాయం. విరాట్ ఆడాలని ఫ్యాన్స్ అంతా బలంగా కోరుకుంటున్నారు. వన్ డౌన్ లో పంత్, టూ డౌన్ లో సూర్య, ఆ తర్వాత దూబే, మిడిల్ లో పాండ్యా మంచి టచ్ లోనే కనిపిస్తున్నారు కాబట్టి కంగారు పడాల్సిన పనిలేదు. ఫినిషింగ్ అవసరమైన టైమ్ లో జడ్డూ, అక్షర్ తలో చేయి వేయటానికి సిద్ధంగా ఉంటారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే మన దేవుడు మన దిక్కంతా జస్ ప్రీత్ బుమ్రానే. బూమ్ బూమ్ మరోసారి మ్యాజిక్ వర్కవుట్ చేస్తే చాలు మనం ఎంచక్కా ఫైనల్ కు చేరుకోవచ్చు. పాండ్యా అందిస్తున్న సహకారం, కాస్త పరుగులు ఇచ్చేస్తున్నా అర్ష్ దీప్ తీస్తున్న వికెట్లు, కుల్దీప్ వేస్తున్న మ్యాజిక్ డెలెబ్రీలు టీమిండియాకు కావాల్సిన బూస్టప్ ను ఇస్తున్నాయి. అవసరమైన సమయాల్లో ఆదుకుంటున్నాయి.
ఇక ఇంగ్లండ్ విషయానికి వస్తే ఈ వరల్డ్ కప్ లో ఇప్పటివరకూ వాళ్లు ఆడి గెలిచిన పెద్ద టీమ్ వెస్టిండీస్ మాత్రమే. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చేతుల్లో మ్యాచ్ లు ఓడిపోయింది ఇంగ్లండ్. కానీ వాళ్ల బలం వాళ్ల ఓపెనింగ్ బ్యాటర్లే. బట్లర్ అండ్ ఫిల్ సాల్ట్ ఈ వరల్డ్ కప్ లో వాళ్లకు విజయాలు అందిస్తూ వస్తున్నాయి. సో ఎర్లీ వికెట్లు తీస్తే టీమిండియా కు అనుకూలం. బెయిర్ స్టో ఫామ్ లో లేడు కానీ అంత తేలిగ్గా తీసుకోలేం. మిడిల్ ఆర్డర్ లో హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్ స్టోన్, మొయిన్ అలీ, శామ్ కర్రన్ లపై ఓ కన్నేసి ఉంచాల్సిందే. మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసేస్తారు వీళ్లు. క్రిస్ జోర్డాన్, జోఫ్రాకు తోడుగా మార్క్ వుడ్ ను తీసుకోవాలా అని కూడా ఇంగ్లండ్ ఆలోచిస్తోంది. లేకుంటే ఆదిల్ రషీద్ కూడా టీమ్ లో ఉంటాడు. లాస్ట్ టైమ్ వరల్డ్ క ప్ అంటే ఈ రెండు కలిసి 2022లో ఆడాయి. అప్పుడు ఇంగ్లండ్ మనల్ని 10వికెట్ల తేడాతో ఘోరంగా ఓడించింది. సో టీమిండియా మొత్తం సమష్ఠిగా రాణిస్తేనే రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ఈసారి రఫ్పాడించగలుగుతాం.