కేవలం రెండేళ్ల గ్యాప్ అంతే. ఇంగ్లండ్ కు ఇవ్వాల్సిన బాకీ తిరిగి ఇచ్చేశాం. అందరికీ గుర్తుండే ఉంటుంది. 2022 టీ20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో జరిగింది. భారత్ అద్భుతమైన విజయాలతో సెమీఫైనల్ కు దూసుకు వచ్చింది. సెమీస్ లో ఇంగ్లండ్ తో మ్యాచ్. ఆ వరల్డ్ కప్ అప్పటి వరకూ బాగా ఆడిన భారత్ అనూహ్యంగా ఆ మ్యాచ్ లో 168పరుగులు మాత్రమే కొట్టగలిగింది. చేధనకు దిగిన ఇంగ్లండ్ వాళ్ల బ్యాటర్లు అలెక్స్ హేల్స్, జోస్ బట్లర్ చెరో 80 పరుగులు చేసి భారత్ పై పదివికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించారు. నాకౌట్ స్టేజ్ లో అలాంటి పరాభవంతో భారత్ ఇంటిదారి పట్టక తప్పలేదు. పాకిస్థాన్ మీద విరాట్ కొహ్లీ కొట్టిన అద్భుతమైన ఇన్నింగ్స్ చూసిన భారత అభిమానులు ఆ వరల్డ్ కప్ ఎలాగైనా మనకే రావాలని కోరుకున్నారు. అంతటి మంచి ఇన్నింగ్స్ చూసిన ఫ్యాన్స్ ఇంగ్లండ్ మీద పదివికెట్ల పరాజయాన్ని జీర్ణించుకోలేకపోయారు. దానికి బదులు టీమిండియా నిన్న తీర్చుకున్నట్లు అనిపించింది. సిచ్యుయేషన్ సేమ్ భారత్ అప్రతిహతంగా సెమీ ఫైనల్ కు దూసుకువచ్చింది. ఇంగ్లండ్ చచ్చీ చెడి సెమీస్ కు చేరుకుంది. ఇప్పుడు ఎవరు గెలిస్తే వాళ్లే ఫైనల్ కు వెళ్తారన్న టైమ్ లో ఈసారి జోల్ట్ టీమిండియా ఇచ్చింది. బ్యాటింగ్ కు కఠినతరమైన పిచ్ పై ముందు బ్యాటింగ్ చేసి 171 పరుగులు కొట్టిన భారత్..ఇంగ్లండ్ కు 172 టార్గెట్ విసిరింది. ఇంగ్లండ్ ఉన్న బ్యాటింగ్ లైనప్ కు అది సాధ్యమయ్యే స్కోరే కొట్టేద్దాం అనుకుని ఉంటారు ఇంగ్లండ్ బ్యాటర్లు ఓవర్ కాన్ఫిడెన్స్ కి పోయి షాట్లు ఆడటానికి ట్రై చేశారు. మన స్పిన్నర్ల ఉచ్చులో చిక్కుకుని వికెట్లు సమర్పించుకోవటంతో పాటు ఒత్తిడిలో కూరుకుపోయి రనౌట్లు ఔపోయారు. ఎవరూ ఊహించని రీతిలో 103పరుగులకే ఆలౌట్ భారత్ కు 68పరుగులతో ఘన విజయాన్ని సమర్పించుకున్నారు. అప్పుడల్లా ఇప్పుడిలా రెండేళ్లు తిరిగి సరికి భారత్ సరిగ్గా అదే టీ20 ప్రపంచకప్ లో అదే సెమీస్ లో ఇంగ్లండ్ కు పొగబెట్టి ఊహించలేని షాక్ ఇచ్చారు మనోళ్లు. రెండేళ్ల క్రితం ఏం జరిగిందో గుర్తుందిగా అంటూ ఇంగ్లండ్ రెండు రోజుల నుంచి తమ అఫీషియల్ సైట్లలో వేస్తున్న పోస్టర్లకు గ్రౌండ్ లోనే సమాధానం చెప్పారు మనోళ్లు.
క్రికెట్ వీడియోలు
India vs England T20 World Cup 2024 Semis 2 | రెండేళ్ల గ్యాప్ లో ఇంగ్లండ్ కు ఇవ్వాల్సింది ఇచ్చేశాం | ABP Desam
మరిన్ని చూడండి