ఇటీవల థియేటర్లలో విడుదలైన కొద్దిరోజులకే చాలా సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కొన్ని సినిమాలైతే థియేటర్లలో విడుదల కాకుండా, నేరుగా ఓటీటీలోనే విడుదలవుతున్నాయి. ఇప్పుడదే బాటలో సుమంత్ హీరోగా నటించిన సినిమా విడుదలవుతోంది.
సుమంత్ హీరోగా ప్రశాంత్ సాగర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అహం రీబూట్’. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సైకలాజికల్ థ్రిల్లర్.. ఏవో కారణాల వల్ల థియేటర్లలో విడుదలకు నోచుకోలేదు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కి రెడీ అయింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో జూన్ 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది.