ByGanesh
Sat 29th Jun 2024 12:30 PM
ఈ మధ్యన సిల్వర్ స్క్రీన్ పై కన్నా సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్న సమంత తాను గతంలో చాలా తప్పులు చేశాను. కానీ ఇప్పుడు చెయ్యడం లేదు అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవడం కాదు.. సమంత గతం లో ఏం తప్పులు చేసింది, ఆ తప్పులేమిటి అని చాలామంది ఆలోచించేస్తున్నారేమో.. ఆ తప్పులేమిటో కూడా సమంత సవివరంగా వివరించింది.
సెలబ్రిటీస్ చాలామంది పలు బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్ గా తెగ సంపాదిస్తూ ఉంటారు. సెలబ్రిటీస్ ప్రమోట్ చేస్తే సామాన్య ప్రజలు అదేదో మంచి ప్రోడక్ట్ అని కొనకుండా ఉండలేరు. అలానే సమంత చాలా ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేస్తూ యాడ్స్ చేసింది. కానీ ఇప్పుడు ఆరోగ్యానికి ఏది మంచిదో, తాను మాయోసైటిస్ వలన ఎంతగా సఫర్ అయ్యిందో అనేది పలు ఇంటర్వూస్ లో చెప్పుకొస్తుంది. అందులో భాగంగా ఓ నెటిజెన్ ఇప్పుడు హెల్త్ గురించి, మిగతా విషయాల గురించి బాగానే చెబుతున్నారు. కానీ గతంలో మీరే అనారోగ్యకరమైన బ్రాండ్స్ ని ప్రమోట్ చేశారు కదా అని ప్రశ్నించగా.. దానికి సమంత అవును నేను గతంలో పొరబాట్లు చేశాను. అది వాస్తవం కూడా. కానీ అవన్నీ తెలియక చేసిన తప్పులే, అవి ప్రమాదకరమని తెలిసాక వాటిని ప్రమోట్ చెయ్యడం ఆపేసాను. ఇప్పుడు ఎదైతే చేస్తున్నానో అదే చెబుతున్నాను అంటూ సమంత తాను చేసిన తప్పులని సిగ్గుపడకుండా ఒప్పుకుంది.
Misguided Samantha:
Samantha admits to making mistakes in the past by endorsing unhealthy brands