అర్జునుడి పాశుపతాస్రానికి ఎంతటి శక్తీ ఉందో, మనం మాట్లేడే మాటకి అంతే శక్తీ ఉంటుంది. ఉన్నత స్థానంలో కూర్చోబెట్టాలన్నా, అధం పాతాళానికి పడిపోవాలన్నా మాటే ప్రధాన ఆదాయ వనరు. అందుకే అంటారు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రతగా మాట్లాడాలని..మాట అదుపు తప్పితే ఏం జరుగుతుందో గతంలో చాలా సార్లు చాలా మంది నిరూపించారు. తాజాగా ఇంకో ముగ్గురు నిరూపిస్తున్నారు.
పోసాని కృష్ణ మురళి (posani krishna mural)అలీ(ali)యాంకర్ శ్యామల (shyamala)ఈ ముగ్గురు కూడా తెలుగు సినిమా బిడ్డలని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వాళ్ళ వాళ్ళ పరిధి మేరకు బాగానే రాణిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఈ ముగ్గురు తమ ఇళ్ళకి తాళాలు వేసుకొని బతుకుతున్నారు. విచిత్రం ఏంటంటే వాళ్ళు ఇంటి లోపలే ఉండి. బయట తాళాలు వేసుకుంటున్నారు. కనీసం పాల వాళ్ళు వచ్చి పిలిచినా తలుపు తియ్యటం లేదు. అలీ అయితే ఏటో వెళ్లిపోయాడనే వార్తలు వస్తున్నాయి.ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు నట్టి కుమార్ ఈ విషయాన్నీ వెల్లడించాడు.
ఇక అదంతా ఆ ముగ్గురు కావాలని చేసుకుందే. ఆంధ్రప్రదేశ్ లో మొన్నటికి దాకా అధికారంలో ఉన్న వైసీపీ కి వకాల్తా పుచ్చుకొని టిడిపి,జనసేన అధినేతలైన చంద్రబాబునాయుడు(chandrababu naidu) పవన్ కళ్యాణ్ (pawan kalyan)ని నానా దుర్భాషలు ఆడారు. సభ్యసమాజం మొత్తం ఆ ముగ్గురు మాట్లాడిన మాటలకి తలదించుకుంది. ఇక ఇప్పుడు టీడీపీ, జనసేన అధికారంలోకి రావడంతో భయంతో తాళాల ఆట ఆడుకుంటూ కర్మ అనుభవిస్తున్నారు. ఇక అదే ఇంటర్వ్యూలో నట్టి కుమార్ మాట్లాడుతు ప్రజలే మీకు గుణపాఠం చెప్పారు. కాబట్టి మా గవర్నమెంట్ ఏమి చెయ్యదు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీకు ఇప్పుడు జగన్ కూడా సపోర్ట్ గా రాడు. ఎందుకంటే మీరు పెయిడ్ ఆర్టిస్టులని డబ్బిచ్చిన జగన్ కి బాగా తెలుసనీ చెప్పాడు.