Sports

pm modi amit shah rahul gandhi mallikarjun kharge congratulates indian cricket team it won t20 world cup 2024


T20 World Cup 2024: 13 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని గెలుచుకున్న టీమిండియా… ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను 7 పరుగుల తేడాతో ఓడించింది. ప్రతిష్టాత్మకమైన టీ20 ప్రపంచకప్‌ విజేతగా నిలిచింది. ఇంతటి ఘనత సాధించిన టీమిండియాను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ప్రధాన ప్రతిక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సహా రాజకీయ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. 

టీ20 ప్రపంచకప్‌ గెలుచుకున్న టీమిండియాను అభినందిస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్టు చేశారు ప్రధానమంత్రి మోదీ. అందులో ఆయన మాట్లాడుతూ.. “మా జట్టు T20 ప్రపంచ కప్‌ను చాలా స్టైల్‌గా తీసుకువచ్చింది. దానికి భారతీయులమంతా గర్విస్తున్నాం. ప్రపంచ కప్‌ను గెలుచుకున్న భారత్‌ క్రికెట్‌ జట్టు కోట్లాది మంది భారతీయుల హృదయాలను కూడా గెలుచుకుంది. ఈ మ్యాచ్‌ గెలవడం చిన్న విషయం కాదు. భారత క్రికెట్ జట్టును చూసి మేం గర్విస్తున్నాము. ఈ మ్యాచ్ చరిత్రాత్మకమైనది” అని ప్రధాని మోదీ వీడియో అభిప్రాయపడ్డారు. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా టీమిండియాకు అభినందనలు తెలిపారు.  టీమిండియా పోరాట పటిమను ఆమె కొనియాడారు. “T20 ప్రపంచ కప్ గెలిచినందుకు టీమ్ ఇండియాకు నా హృదయపూర్వక అభినందనలు. గెలవాలన్న స్ఫూర్తితో, జట్టు క్లిష్ట పరిస్థితుల్లో అత్యుత్తమ నైపుణ్యాలు ప్రదర్శించారు ఆటగాళ్లు. టోర్నమెంట్‌లో ఇది అసాధారణ విజయం, మేము మిమ్మల్ని చూసి గర్విస్తున్నాము! అని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.  

కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా జట్టును అభినందించారు, “మా ఆటగాళ్ళు T20 ప్రపంచ కప్‌లో అసమానమైన టీమ్‌ స్పిరిట్‌ను చూపించారు. క్రీడాస్ఫూర్తితో అద్భుతమైన ప్రదర్శన చేశారు. వారి చారిత్రాత్మక విజయాన్ని చూసి దేశం గర్విస్తోంది.” “ప్రపంచ ఛాంపియన్ జట్టుకు అభినందనలు. దేశానికిది మరుపురాని అద్భుతమైన క్షణం,” అని సోషల్‌ మీడియాలో సందేషం పోస్టు చేశారు. 

“భారత క్రికెట్ జట్టు సాధించిన అద్భుతమైన విజయంగా దీన్ని అభివర్ణించారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ” T20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి భారత జట్టు చరిత్ర సృష్టించింది! భారతదేశం T20 క్రికెట్ ప్రపంచ కప్‌ను గెలుచుకోవడంతో దేశ హృదం ఉప్పొంగింది. తమ శక్తిని అద్భుతంగా ప్రదర్శించినందుకు భారత క్రికెట్ జట్టుకు నా అభినందనలు. ఈ విజయం చాలా మంది రాబోయే క్రికెటర్లు క్రీడాకారులను ప్రేరేపిస్తుంది, అని అభిప్రాయపడ్డారు. 

లోక్‌సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ కూడా భారత జట్టుపై ప్రశంసలు కురిపించారు. మిండియా ఆటగాళ్లంతా దేశం గర్వించేలా చేశారని అభిప్రాయపడ్డారు. “సూర్యా, వాట్ ఎ బ్రిలియంట్ క్యాచ్! రోహిత్, ఈ విజయం మీ నాయకత్వానికి నిదర్శనం. రాహుల్, టీమ్ ఇండియా మీ గైడెన్స్‌ను మిస్ అవుతుందని నాకు తెలుసు” అని పేర్కొన్నారు. 

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇలా అన్నారు, “17 ఏళ్ల తర్వాత ఫైనల్‌లో టీమ్ ఇండియా T20 వరల్డ్‌కప్‌ను గెలుచుకుంది! వారి ప్రతిభ, అంకితభావం ఆకట్టుకునే ప్రదర్శన చేసినందుకు ఆటగాళ్లకు అభినందనలు. విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్ అర్ష్‌దీప్ సింగ్ అందించిన అద్భుతమైన విజయానికి గర్వపడుతున్నాను. అని సోషల్ మీడియాలో మెసేజ్ పోస్టు చేశారు. 

మరిన్ని చూడండి



Source link

Related posts

Lionel Messi: స్టార్ ఫుట్‌బాలర్ మెస్సీపై చైనా ప్రభుత్వం, ఫ్యాన్స్ సీరియస్.. ఇదీ కారణం

Oknews

Naatu Naatu at ISPL | Sachin, Suriya లతో కలిసి సందడి చేసిన Ram Charan | ABP Desam

Oknews

Rishabh Pant Makes Cricket Comeback In Alur Set To Lead Delhi Capitals In IPL 2024

Oknews

Leave a Comment