Hardik Pandya in Tears After India Win : ఎన్ని మాటలు పడ్డాడు. ఎంత మానసిక సంఘర్షణ అనుభవించాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఉండాలని కోరుకున్నందుకు ఒక్కసారిగా గొప్ప ఆటగాడు కాస్త సెల్ఫిష్ గా పేరు పడిపోయాడు. ఐపిఎల్ లో పెద్దగా రాణించలేదు. మరోవైపు వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు. ఎవరికీ ఏం చెప్పలేక ఆడలేక సతమత మైపోయాడేమో. అందుకే టీ 20 ప్రపంచ కప్ లో కసితీరా ఆడాడు. విజయం సాధించిన వెంటనే వెక్కి వెక్కి ఏడ్చాడు.
టీ 20 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. సుదీర్ఘ ఎదురుచూపులకు తెరదించింది. చివరి ఓవర్ వరకూ ఉత్కంఠ రేపిన టైటిల్ పోరులో అదరగొట్టి, సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది. విజయం సాధించిన వెంటనే కన్నీరు పెట్టని ఆటగాడు లేడు. టీం ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య కన్నీరు మున్నీరు అయ్యాడు. టెస్టు , వన్డే వరల్డ్ కప్ చేజార్చుకున్న బాధ కరిగిపోయేంతగా భావోద్వేగానికి గురయ్యారు. ముందు బంతికే విజేతలం అని తెలిసినా హార్దిక్ పాండ్యా చివరి బంతి వెయ్యగానే రోహిత్ శర్మ మైదానంలో నేలమీద కసిదీరా కొడుతూ ఆనందాన్ని ప్రదర్శించాడు. రోహిత్ శర్మ తనలో ఉన్న ఎమోషనల్ మొత్తాన్ని చూపించాడు. గ్రౌండ్‌లో పడుకొని నేలపై కొట్టిగా కొడుతూ మొత్తానికి సాధించా… మొదటి వరల్డ్‌కప్‌లో భాగమైన ఉన్నా… తన కేరీర్‌లో ఆడిన ఆఖరి వరల్డ్‌కప్‌ను తన సారథ్యంలోనే గెలిచానన్న ఆనందం భావోద్వేగం రోహిత్‌లో కనిపించింది. ఇక హార్దిక్ పాండ్యా గెలిచిన ఆనందంలో ఏడ్చేశాడు. తోటి ఆటగాళ్ళను కౌగలించుకుంటున్నాడే గానీ పాండ్య కన్నీరు ఆగలేదు.
Hardik Pandya in tears after defending the runs in the 20th over. 🥺 pic.twitter.com/7vu6oIdzd0
— Johns. (@CricCrazyJohns) June 29, 2024
ద్రవిడ్‌కు ఆగని కన్నీళ్లు
ఎప్పుడూ స్థిమితంగా స్థిరంగా ఉండే కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా టీమిండియా ప్రపంచకప్ గెలిచిన అనంతరం కంటతడి పెట్టుకున్నాడు. ద్వైపాక్షిక సిరీస్‌లు…టెస్టుల్లో అద్భుతంగా ఆడే టీమిండియా ఐసీసీ టోర్నీల్లో తేలిపోతోందని… కోచ్‌గా ద్రవిడ్ సరైన మార్గనిర్దేశనం చేయడం లేదని కూడా విమర్శలు వచ్చాయి. వీటన్నింటినీ భరిస్తూ వచ్చిన ద్రవిడ్ దానికి ఒక్క కప్పుతో సమాధానం చెప్పేశాడు. అంతేకాదు కోచ్‌గా తొలి ప్రపంచ కప్‌ను జట్టు గెలవగానే కన్నీళ్లు పెట్టుకున్నాడు. సిరాజ్ నుంచి జట్టు సహాయ సిబ్బంది వరకూ అందరూ ఈ గెలుపుతో భావోద్వేగానికి గురై ఏడ్చేశారు.
మరిన్ని చూడండి