ఈ రోడ్డు ప్రమాదం రాష్ట్రంలో ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరంలో జరిగింది. ఒకే ప్రదేశంలో మూడు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఐతవరంలో 65 నంబర్ జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న గ్యాస్ సిలిండర్ లోడుతో ఉన్న లారీని అటుగా వస్తున్న మరొక లారీ ఢీకొంది. ఈ ప్రమాదం జరిగిన స్థలానికి చూడటానికి తండ్రి కొడుకులు వెళ్లారు. వారిపైకి ఇంకో లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తండ్రి కొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిద్దరూ అదే గ్రామానికి (ఐతవరం) సంకు మధవరావు, రామరాజుగా గుర్తించారు.