దిశ, ఫీచర్స్ : ఫాస్ట్ ఫుడ్స్ వచ్చినప్పటి నుంచి కూరగాయలు, ఆకుకూరలు తినడమే మానేశారు. కానీ మీ ఆహారంలో వీటిని చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. దీనివల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. వాటిలో క్యాబేజీని తినాల్సిందే అని చెబుతున్నారు. ఎందుకంటే వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణ క్రియ పనితీరును మెరుగుపరుస్తుంది. క్యాబేజి తీసుకోవడం వలన మన ఆరోగ్యానికి కలిగే లాభాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..
మధుమేహం
క్యాబేజీలో యాంటీహైపర్‌గ్లైసెమిక్ లక్షణాలు ఉన్నాయి. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. మధుమేహం నెఫ్రోపతీ నుండి కాపాడుతుంది. ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఖచ్చితంగా క్యాబేజీని ఆహారంలో చేర్చుకోవాలి.
జీర్ణక్రియ
పీచు పుష్కలంగా ఉండే క్యాబేజీ చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. ఇది కడుపులో పుండ్లకి కూడా చెక్ పెడుతుంది. క్యాబేజీని ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ పని తీరును మెరుగుపరుస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం ద్వారా మలబద్ధకం సమస్యలను తగ్గుతాయి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.