Health Care

వర్షాకాలంలో తినకూడని కూరగాయలు


దిశ, ఫీచర్స్ : వర్షాకాలం వ్యాధులను ఆహ్వానించే సమయం. ఉష్ణోగ్రతలో మార్పు, వానల కారణంగా కొన్ని కూరగాయలు అధిక తేమను కలిగి ఉండేందుకు కారణం అవుతుంది. బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, సూక్ష్మ జీవుల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇలాంటి పదార్థాలను భోజనంలో చేర్చుకుంటే అనారోగ్యంపాలు కావాల్సి వస్తుంది. అందుకే ఈ టైంలో కొన్ని కూరగాయలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు.

* ఆకు కూరలు

బచ్చలి, మెంతులు, కాలే వంటి ఆకు కూరలు వర్షాకాలంలో సులభంగా కలుషితం అయిపోతాయి. రుతుపవనాల కారణంగా వీటిపై సూక్ష్మ జీవులు, బ్యాక్టీరియా పెరుగుతాయి. వీటిని ఆహారంగా తీసుకున్నా అజీర్ణం, ఇన్ఫెక్షన్స్ లాంటివి జరగొచ్చు.

* కాలీఫ్లవర్, బ్రోకలీ

బ్రోకలీ రోజూ తీసుకున్నా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని తాజా అధ్యయనం తెలిపింది. కానీ వర్షాకాలంలో బ్రోకలీ, కాలీ ఫ్లవర్ కు దూరంగా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వాటి ఆకులపై పురుగులు రెట్టలు వేయొచ్చు. దీనివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చి హెల్త్ పాడవుతుందని హెచ్చరిస్తున్నారు.

* వంకాయలు

వంకాయ మొక్క తెగుళ్ల నుంచి తనను తాను కాపాడుకునేందుకు ఆల్కలాయిడ్స్ అని పిలవబడే కెమికల్స్ ను డెవలప్ చేస్తుంది. దీనివల్ల ఈ మొక్క వంకాయలు విషపూరితం అవుతాయి. ఇది స్కిన్ అలెర్జీ, వికారం లాంటి రియాక్షన్స్ ఉంటాయి.

* బీన్స్, బఠానీ

బీన్స్, బఠానీ లాంటి కూరగాయలు తేమను నిలుపుకోగలవు. శిలీంధ్రాల పెరుగుదలకు అనువుగా ఉండగలవు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో తినాల్సి వస్తే బాగా ఉడికించాలని సూచిస్తున్నారు నిపుణులు. లేదంటే అంటువ్యాధుల ప్రమాదాన్ని పెంచగలవు.



Source link

Related posts

వేణువును ఇంట్లో పెడితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా..

Oknews

బంగారం, వెండితో అనంత్ అంబానీ వెడ్డింగ్ కార్డ్.. దీని ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Oknews

హార్డ్ వర్క్‌తో అలిసిపోతున్నారా? ఈ సింపుల్ టిప్స్‌తో స్మార్ట్ వర్క్ ట్రై చేయండి.. సక్సెస్ మీ సొంతం..

Oknews

Leave a Comment