Sports

BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 | | BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా


BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 |  టీ20 వరల్డ్ కప్ గెలిచిన మధుర క్షణాల్ని ఇంకా ఆస్వాదిస్తున్న సమయంలోనే బీసీసీఐ ఓ సంచలన ప్రకటన చేసింది. అదేటంటే.. ఉత్తమ ప్రదర్శన కనబర్చి ఒక్క ఓటమి చూడకుండానే టీ20 వరల్డ్ కప్ ను  కైవసం చేసుకుంది రోహిత్ సేన. 13 ఏళ్లుగా ఏ ఐసీసీ ట్రోఫీ అందుకోని బీసీసీఐకు ఈ విజయం సగర్వంగా తల ఎత్తుకునేలా చేసింది. అందుకే.. కప్పు గెలిచిన టీం ఇండియాకు 125 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ ప్రకటిస్తున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జై షా ఆదివారం రాత్రి ప్రకటించారు. 
టీ20 ప్రపంచకప్‌ గెలిచిన టీమ్‌ఇండియాకు రూ.125 కోట్ల నగదు బహుమతిని ప్రకటిస్తున్నందుకు సంతోషిస్తున్నా. టోర్నీ ఆసాంతం జట్టు అసాధారణ ప్రతిభ, పట్టుదల, క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించింది. ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయ సిబ్బందికి అభినందనలు అని  జై షా ట్విట్టర్  ఎక్స్‌లో పేర్కొన్నారు. ప్రపంచంలోనే బీసీసీఐ బాగా రిచ్ అని చెప్పడానికి ఇదే ఓ ఎక్సాంపుల్ ఎలాగంటే..! టీ20 వరల్డ్ కప్ గెలిచినందుకు గానూ… ఐసీసీ ఇచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..! సుమారు 20 కోట్ల 42 లక్షలు. మరి బీసీసీఐ ఇస్తోంది 125 కోట్లు. అంటే 100 కోట్లు ఎక్కువే అనమాట. అందుకే… అంటార్రా బాబు బీసీసీఐ తోపు అని ఫ్యాన్స్ ఈ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని చూడండి



Source link

Related posts

United World Wrestling lifts suspension on Wrestling Federation of India

Oknews

ICC ODI World Cup 2023: 4 Young Players Who Can Be The Breakout Stars | ODI World Cup 2023: ఆ నలుగురు

Oknews

Under-19 World Cup Nepal Won Againist Afghanisthan

Oknews

Leave a Comment