Health Care

నేడు నేషనల్ డాక్టర్స్ డే..ఈ రోజే ఎందుకు జరుపుకుంటారో తెలుసా?


దిశ,వెబ్‌డెస్క్: వైద్యులు దేవుళ్లతో సమానమని పూర్వీకులు, గురువులు చెబుతుంటారు. తల్లిదండ్రులు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తారు. ఎంతటి వ్యాధినైనా నయం చేస్తున్న వైద్యుల దినోత్సవం జూలై 1వ తేదీన జరుపుకుంటారు. కరోనాను ఎదుర్కొవడంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కోట్లాది మందిని కాపాడిన ఘనత డాక్టర్లకే చెందుతుంది. కరోనా సమయంలో వారు చేసిన సేవలను ఎవరు మరిచిపోలేరు..ఇప్పటికి వారి సేవలను నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటికే ప్రాథమిక వైద్య సదుపాయాన్ని అందిస్తున్న వైద్యులకు సెల్యూట్ చేస్తూ ప్రశంసిస్తున్నారు.

పశ్చిమ బెంగాల్ రెండో సీఎం బిధాన్ చంద్ర రాయ్ ఒక ప్రముఖ వైద్యుడు. డాక్టర్‌గా, సీఎంగా వైద్య రంగంలో ఆయన చేసిన సేవలకు గౌరవ సూచకంగా బిధాన్ పుట్టిన రోజైన జులై 1వ తేదీన భారత ప్రభుత్వం జాతీయ వైద్యుల దినోత్సవంగా 1991లో ప్రకటించింది. అప్పటి నుంచి మన దేశంలో ప్రతి ఏడాది జులై 1వ తేదీన నేషనల్ ‘డాక్టర్స్ డే’గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా వైద్యరంగంలో డాక్టర్ల నిస్వార్థ సేవను, అమూల్యమైన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలందరి ప్రాణాలను కాపాడటానికి, ప్రజల ఆరోగ్యాలను ఎల్లప్పుడూ కాపాడేందుకు ఎంతగానో శ్రమించే హీరోలే డాక్టర్స్ అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.



Source link

Related posts

వేసవిలో ఆరోగ్యంగా ఉండాలా.. ఈ 4 తప్పులు అస్సలే చేయకూడదు!

Oknews

జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి రోజూ ఈ విధంగా చేయండి!

Oknews

ఈ 4 పండ్లు వాతానికి కారణం కావచ్చు.. అవేంటో చూడండి..

Oknews

Leave a Comment