ప్రపంచంలో ఎన్ని ఖండాలు ఐతే ఉన్నాయో వాటన్నింటికి ఒక నూతన సంవత్సరం అనేది ఉంటుంది. అదే విధంగా తెలుగు వారికి కూడా ఉగాది రూపంలో ఉంది. కానీ ఇప్పుడు అభిమానులకి కూడా ఒక నూతన సంవత్సరం వచ్చింది. వాళ్ళు ఎవరో కాదు నందమూరి అభిమానులు. అదెలా అని అంటారా. ఇప్పుడు నేను చెప్పబోయే మ్యాటర్ వింటే నాతో పాటు మీరు కూడా స్వరం కలుపుతారు.
నందమూరి నటసింహం యువరత్న బాలకృష్ణ (balakrishna)రాజకీయ టెన్షన్స్ నుంచి కొంచం ఫ్రీ అయ్యాడు. దీంతో తన కొత్త చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం కర్నూల్ జిల్లా ఆదోని లో షూటింగ్ జరుగుతుంది. చిరంజీవి(chiranjeevi)కి వాల్తేరు వీరయ్య లాంటి మెమరబుల్ హిట్ ఇచ్చిన బాబీ(bobby)దర్శకుడు. దీంతో ఎన్ బికే అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ఇయర్ లోనే విడుదల కానుంది. ఇందు కోసం శరవేగంగా ముస్తాబవుతోంది. డిసెంబర్ లో రిలీజ్ కావచ్చనే సంకేతాలు వస్తున్నాయి. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్(ntr)దేవర(devara)సెప్టెంబర్ 27 న వస్తుంది. ఈ మూవీ ద్వారా తన నట విశ్వరూపాన్ని ఎంతో మంది నటులకి బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్టీఆర్ మార్చబోతున్నాడు. పాన్ ఇండియా లెవల్లో విడుదల అవుతుండగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ ఆశలే పెట్టుకున్నారు. ప్రస్థుతానికి ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా వచ్చిన టీజర్ ని రిపీటెడ్ గా చూస్తు మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు
ఇక అన్నికంటే ముఖ్యమైన విషయం.. బాలకృష్ణ ముద్దుల తనయుడు.. నందమూరి మరో అందగాడు మోక్షజ్ఞ(mokshagna)ఈ ఏడాదే సినీ రంగ ప్రవేశం చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా మోక్షజ్ఞ ట్విట్టర్ నుంచి ఒక పిక్ బయటకి వచ్చింది. కంప్లీట్ హీరో లుక్ తో ఉన్న ఆ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. పైగా నేను వస్తున్నాను మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలంటూ ట్వీట్ చేసాడు. దీంతో ఎంటైర్ నందమూరి అభిమానుల్లో ఉత్సాహం వచ్చింది. నందమూరి నట వారసత్వాన్ని ఇంకో లెవెల్ కి తీసుకెళ్లే హీరో రాబోతున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాకపోతే ఆ ట్వీట్ మోక్షజ్ఞ చెయ్యలేదని ఫేక్ ట్వీట్ అనే వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఒక్కటి మాత్రం నిజం. సెంటిమెంట్ ని ఫాలో అయ్యే బాలయ్య ఈ ఏడాదే మోక్షజ్ఞ ని పరిచయం చెయ్యడం గ్యారంటీ అని అంటున్నారు. ఎందుకంటే ఈ ఏడాది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. బాలయ్య కూడా మూడోసారి ఎంఎల్ ఏ గా ఎన్నిక అయ్యాడు. సో మోక్షజ్ఞ లాండింగ్ ఈ ఏడాది షురూ అని అంటున్నారు. సో నందమూరి నామ సంవత్సరం నిజమే కదా.