దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న సమస్యల్లో మలబద్ధకం సమస్య ఒకటి. చిన్న వారి నుంచి పెద్దవారి వరకు చాలా మంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అయితే శరీరానికి కావలసిన మోతాదులో ఫైబర్ ఫుడ్ తీసుకోకపోవడం వలన ఈ సమస్య అనేది వస్తుంది. అందువలన తప్పకుండా ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 30 గ్రాముల ఫైబర్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని వలన మలబద్ధకం సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చునంటన.కాగా, ఈ సమస్య నుంచి బయట పడటానికి ఈఫుడ్ తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. కాగా, అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- మలబద్ధకం సమస్య నుంచి బయటపడటానికి రాజ్మా తీసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఇందులో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. అలాగే శరీరానికి కావాల్సిన మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం కూడా ఇందులో పుష్కలంగా ఉంటుంది. అందుకే మలబద్ధకం సమస్యతో బాధపడేవారికి ఇది బెస్ట్ ఫుడ్.
- ఆరోగ్యానికి మంచి చేసే ఆకుకూరల్లో పాల కూర కూడా ఒకటి. ఇందులో విటమిన్ ఏ, సీ, కేతో పాటు ఫైబర్ కూడా ఉంటుంది.
- బెర్రీల్లో యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందువలన మలబద్ధకం సమస్యతో బాధపడేవారు తప్పకుండా తమ డైట్‌లో బెర్రీస్ చేర్చుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు.
- జీడిపప్పు, బాదం, అవకాడో, వాల్ నట్స్, వంటివి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని రోజూ తినడం వలన కూడా అనారోగ్య సమస్యల నుంచి ఈజీగా బయటపడవచ్చు.
- బొప్పాయి ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని తినడం వలన జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. జీర్ణక్రియ సక్రమంగా సాగడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అందువలన మలబద్ధకం సమస్యతో బాధపడేవారు ఈ పండు తినడం వలన ఆ సమస్య నుంచి బయటపడవచ్చునంట.
(నోట్ : ఇది ఇంటర్నెట్‌లోని సమాచారం మేరకు మాత్రమే ఇవవ్వబడినది. దిశ దీనిని ధృవీకరించలేదు.)