Health Care

విష సర్పాలకు నిలయం.. ఆ ప్రాంతానికి ఎవరైనా వెళ్లారో ఇక..!


దిశ, ఫీచర్స్ : సాధారణంగా పాములంటేనే ప్రజలు భయపడుతుంటారు. కాటువేస్తే ప్రాణాలు పోతాయని భావిస్తారు. అందుకని అవి తిరుగాడే చోటుకు వెళ్లడానికి సాహసించరు. కానీ ఒక ద్వీపకల్పంలో మాత్రం ఈ విష సర్పాలే అధికంగా ఉంటాయని ట్రావెలింగ్ నిపుణులు చెప్తున్నారు. ఒకవేళ ఎవరైనా అక్కడికి వెళ్లాల్సి వస్తే చాలా జాగ్రత్తలు తీసుకుంటారట. ఇంతకీ ఆ అరుదైన ప్రాంతమేది? అనుకుంటున్నారా? దానిపేరు ‘ఇల్హాడా క్యూయిమాడ’ గ్రాండే.

అట్లాంటిక్ సముద్ర తీరంలో గల ‘ఇల్హాడా క్యూయిమాడ గ్రాండే’లో వందలూ వేలు కాదు.. లక్షల సంఖ్యలో విషపూరిత పాములు నివసిస్తుంటాయని నిపుణులు చెప్తున్నారు. పైగా వీటిలో ‘గోల్డెన్ లాన్స్ హెడ్’ అనే పాము జాతి మరింత ప్రమాదకరమని పేర్కొంటున్నారు. ఎందుకంటే ఇది కాటు వేస్తే విషం శరీరానికి చాలా వేగంగా పాకడంతోపాటు చర్మం పాలిపోతుందట. ఇలాంటి రకరకాల పాములకు నిలయంగా ఉన్నందున ఈ దీవిని ‘కింగ్ డమ్ ఆఫ్ స్నేక్స్’ అని, ‘స్నేక్ ఐలాండ్’ అని కూడా పిలుస్తుంటారు.

ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ నిపుణుల ప్రకారం.. బ్రెజిల్‌లోని సావో పాలో సముద్ర తీరం నుంచి క్యూయిమాడ గ్రాండే దీవి సుమారు 146 కి.మీ ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన ‘వైపర్ స్నేక్స్’ కూడా ఈ ప్రాంతంలో సుమారు 3 నుంచి 4 వేల వరకుక ఉంటాయి. ఇలా రకరకాల విష సర్పాలకు నిలయంగా ఉన్నందున బ్రెజిల్ ప్రభుత్వం ‘క్యూయిమాడ గ్రాండే’ ఐలాండ్‌లో పరిశోధకులను తప్ప సాధారణ ప్రజలను, టూరిస్టులను అనుమతించడం లేదట.



Source link

Related posts

కుక్కర్‌లో వండిన పప్పు ఆరోగ్యానికి మంచిదేనా? ..లేక ప్రమాదమా?

Oknews

గ్రహణం సమయంలో జంతువులు ఎలా ప్రవర్తిస్తాయి..?

Oknews

బట్టలు విప్పేసి వేడుకలో పాల్గొన్న మహిళలు.. పురుషులతో కలిసి ఆ పని చేసేసరికి..!

Oknews

Leave a Comment