Sports

Team India Arrival T20 World Cup winners Rohit Sharma Virat Kohli touch down in Delhi


 T20 World Cup winners touch down in Delhi: విశ్వ విజేతలు స్వదేశానికి చేరారు.   కరేబియన్‌లో జరిగిన ICC T20 వరల్డ్ కప్ 2024లో భారత్  విజేతగా నిలిచిన తర్వాత రోహిత్ అండ్ కో స్వదేశానికి తిరిగి వచ్చారు. గ్రాంట్లీ ఆడమ్స్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి భారత బృందం నిన్న చార్టర్ ఫ్లైట్‌లో ఢిల్లీకి బయలుదేరింది. ఎయిర్ ఇండియా ఛాంపియన్స్ 24 వరల్డ్ కప్ (AIC24WC) పేరుతో ఎయిర్ ఇండియా  ప్రత్యేక చార్టర్ ఫ్లైట్  ఈరోజు ఉదయం 6:20 కి దేశ రాజధానికి చేరుకుంది.

బెరిల్ హరికేన్ కారణంగా భారత జట్టు బార్బడోస్‌లోనే  ఉండిపోవాల్సి వచ్చిన  విషయం తెలిసిందే.  భారత జట్టు, సహాయక సిబ్బంది, ఆటగాళ్ల కుటుంబాలు, బోర్డు అధికారులు మరియు ట్రావెలింగ్ మీడియా బృందం సుమారు 2 రోజులు పాటూ నిరీక్షించిన తరువాత వాతావరణం అనుకూలంగా మారడంతో   భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) చార్టర్ విమానాన్ని ఏర్పాటు చేసింది. . బార్బడోస్‌లో చిక్కుకున్న భారతీయ జర్నలిస్టులు,  బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, సెక్రటరీ జే షాతో కలిసి అదే విమానంలో ఎక్కారని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. ప్రపంచ కప్ స్వదేశానికి చేరుకున్న వీడియొ ను ఇప్పటికే బిసిసిఐ తన  అధికారిక ఎక్స్‌ ఖాతాలో ఒక చిన్న వీడియొ పోస్ట్‌ చేసింది.

విమానం టెర్మినల్ 3 దగ్గరకు రానుండటంతో అక్కడ ఆటగాళ్ళ కోసం ప్రత్యేక బస్సును నిలిపి ఉంచారు. ఈ నేపధ్యం లో విమానాశ్రయంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఎన్నో ఏళ్ళ కలను నిజం చేసిన రోహిత్ జట్టుకు స్వాగతం పలకటానికి భారీగా అభిమానులు అక్కడికి చేరుకున్నారు. టీం ఇండియాకు జేజేలు పలుకుతున్నారు. 

ఎన్నో ఏళ్ళ కలను నిజం చేసిన రోహిత్ జట్టుకు స్వాగతం పలకటానికి భారీగా అభిమానులు అక్కడికి చేరుకున్నారు. టీం ఇండియాకు జేజేలు పలుకుతున్నారు. 

రోహిత్ శర్మ టీ 20 ట్రోఫీని ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో వేచి ఉన్న అభిమానులకు చూపిస్తూ వెళుతున్న వీడియొలు ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. 

మరిన్ని చూడండి





Source link

Related posts

Virat Kohli and Rohit Sharma How the Captain and the King aligned

Oknews

Hardik Pandya Press Meet Rohit Sharma: తమ మధ్య గొడవలు ఉన్నాయని పరోక్షంగా ఒప్పేసుకున్న హార్దిక్

Oknews

Cricket in Olympics: ఒలింపిక్స్‌లో క్రికెట్.. 128 ఏళ్ల తర్వాత తిరిగి వస్తున్న జెంటిల్మెన్ గేమ్

Oknews

Leave a Comment