దిశ, ఫీచర్స్ : పామును చూసి కొందరు భయంతో పారిపోతుంటారు. కొందరికి పాము పేరు కూడా తలవడానికి కూడా వణికిపోతారు. పగలు అంటే మనకి కనిపిస్తాయి, రాత్రిపూట పాములు ఎక్కడ వస్తాయేమో నని వాటిని గమనిస్తూ ఉంటారు. ఈ కారణంగా చెట్లు, పొదలు ఉన్న ప్రాంతాల్లో పాములు ఉంటాయని ప్రజలు వెళ్లేందుకు ఇష్ట పడరు. ఎలుకల కోసం ఎంత దూరం అయినా వస్తాయి. ఆ సమయంలో మనుషుల కోసమే వచ్చాయని పాము చూసి చాలా మంది భయపడి స్నేక్ సొసైటీ వారికి ఫోన్ చేస్తుంటారు.
సోషల్ మీడియాలో పాము వీడియోలు తక్కువగా కనిపిస్తాయి. కొన్ని చూడాలన్న కూడా భయానకంగా ఉంటాయి. అయినా కూడా నెటిజన్లు కూడా పాము వీడియోలను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా, ఓ వీడియో నెట్టింట హల్చల్ అవుతుంది.
పాము తన పని తాను చేసుకుంటుంది. తాబేలు పామును చూసి దాని దగ్గరికి వెళ్ళింది.. ఇదేంటి నా దగ్గరికి వస్తుందని పాము ఒక్కసారిగా కాటేసింది.. ఆ సమయంలో తన మూతిని కిందకి అన్నది. దీంతో ఆ కాటు డిప్పమీద పడింది. తాబేలు డిప్ప ఎంత బలంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతుంది. తాబేలు దగ్గరా నీ తెలివి తేటలా అంటూ నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు.